హన్మకొండ కోర్టుకు చేరుకుంటున్న బీజేపీ శ్రేణులు (Bandi Sanjay)
బీజేపీ ఎమ్మెల్యేలు ఈటెల, రఘునందన్, రాజాసింగ్ లు అరెస్ట్
కారణాలు చెప్పకుండా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
బండి సంజయ్ గొంతు నొక్కేందుకే అరెస్టులు: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ను అర్థరాత్రి కరీంనగర్ లోని తన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఉదయం హైదరాబాద్ లో ని బొమ్మల రామారం పోలీస స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఇప్పుడు అక్కడ నుంచి వాహనాన్ని వివిధ మార్గాల ద్వారా తరలిస్తున్నారు. ఈ విషయంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భువనగిరి కోర్టులో బండి సంజయ్ ని హాజరుపరిచిన పోలీసులు
ఎందుకు తనని అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని అన్న బండి సంజయ్. లోక్ సభ స్పీకర్ కార్యాలయానికి ఫిర్యాదు
బండి సంజయ్ కి 151 సీఆర్పీసీ కింద నోటీసులు
కారణాలు చెప్పకుండా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ అరెస్టును ఖండిస్తున్నామని తెలిపారు.
బండి సంజయ్ విషయంలో ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే రఘురామరెడ్డిని కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఎందుకని అంటే పోలీసులపై దురుసుగా ప్రవర్తించినందుకు స్టేషన్ కు తీసుకువెళుతున్నట్టు పోలీసులు బదులిచ్చారని అంటున్నారు.
బీజేపీ ఆఫీసుకు వెళుతుండగా హకీంపేటలో ఈటెల రాజేందర్(Etela Rajender) అరెస్ట్
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెంటనే స్పందించారు. ప్రభుత్వాలను ప్రశ్నిస్తే ఇలాగే అరెస్టులు చేస్తారా? అయినా అరెస్టులకు బండి సంజయ్ భయపడరు అని అన్నారు. ఈ స్టేట్మెంట్ రాగానే రాజాసింగ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ముందస్తు జాగ్రత్తల నేపథ్యంలో బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తున్నట్టు వెల్లడి
బండి సంజయ్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్న డీకే అరుణ(DK Aruna)
బండి సంజయ్ గొంతు నొక్కేందుకే అరెస్ట్ చేస్తున్నారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.
బండి సంజయ్ అరెస్ట్ పై హైకోర్టులో హౌస్ ఆఫ్ మోషన్ పిటీషన్ వేసిన బీజేపీ లీగల్ టీమ్
ఉదయం నుంచి తెలంగాణలో బండి సంజయ్ అరెస్టుతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రాష్ట్రమంతా నిరసనలు తెలియజేయాలని బీజేపీ శ్రేణులు నిర్ణయించాయి.
బండి సంజయ్ ను తక్షణమే విడుదల చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు
బండి సంజయ్ ని కలిసిన బూర నర్సయ్యగౌడ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో ఆయనపాత్ర ఉందంటూ పోలీసులు అర్థరాత్రి కరీంనగర్ లోని ఆయన నివాసానికి వెళ్లి అదుపులోనికి తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఒక్కసారి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. అక్కడ స్థానిక బీజేపీ నేతలు హంగామా సృష్టించారు. దీంతో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి ఆయన్ని తీసుకువెళ్లారు.
పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాల వరుస లీకేజీ వ్యవహారాల్లో తెలంగాణ ప్రభుత్వానికి తలబొప్పి కడుతోంది. ఒకవైపు టీఎస్పీఎస్సీ లో లీకేజీ వ్యవహారంలో విచారణ జరుగుతుండగానే, మరోవైపు పదో తరగతి ప్రశ్నాపత్రాలు బయటకు రావడంతో వ్యవస్థలన్నీ ఇంతగా నిర్వీర్యమైపోయాయా? అనే సంకేతాలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.
హన్మకొండ జిల్లా కమలాపూర్ లో పదోతరగతి హిందీ పేపర్ ను పరీక్షా కేంద్రం నుంచి బయటకు వచ్చిన వ్యవహారంలో బండి సంజయ్ ని అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు. కానీ నిజానిజాలు ఇంకా బయటకు రాలేదు.
అంతేకాకుండా ఇంతకుముందు టీఎస్పీఎస్సీ విషయంలో కూడా రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు చేసిన ఆరోపణలపై రేవంత్ రెడ్డిని పిలిచి ‘సిట్’ విచారించింది. మీకు తెలిసిన సమాచారం ఏమిటి? మీ దగ్గరున్న ఆధారాలేమిటి? మాకు అందజేయండి, అని వారిని అడగడం సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఏకంగా బండి సంజయ్ ని అరెస్ట్ చేయడం, ఆయనదే పాత్ర ఉందని చెప్పడంపై రాజకీయంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రాజకీయ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Read Also: ‘చద్దన్నం’ లోని ఔషధ గుణాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
Follow us on: Youtube, Instagram, Google News