38.2 C
Hyderabad
Sunday, May 26, 2024
spot_img

‘సారంగదరియా’ టీజర్‌ లాంచ్ చేసిన శ్రీవిష్ణు

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకం పై చల్లపల్లి చలపతిరావు గారి దివ్య ఆశీస్సులతో ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సారంగదరియా’. సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. మే నెలలో సినిమాను విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే లెజెండ్రీ సింగర్ పాడిన ‘అందుకోవా…’ అనే ఇన్‌స్పిరేషనల్ సాంగ్ తో పాటు ‘నా కన్నులే..’ అనే లిరికల్ సాంగ్స్ ను విడుదల చేయగా వాటికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయి. గురువారం ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు సినిమా టీజర్ ను విడుదల చేసి చిత్రయూనిట్ కి అభినందనలు తెలియజేశారు.

టీజర్‌ను గమనిస్తే.. ఇది పక్కా ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలుస్తుంది. మధ్యవయస్కుడైన ఓ వ్యక్తి.. తన భార్య, ఇద్దరు కొడుకులు, కూతురితో సంసారాన్ని వెల్లదీస్తుంటాడు. సమాజంలో పరువుగా బతికితే చాలు అనుకునే వ్యక్తికి తన కొడుకులు, కూతురు వల్ల ఇబ్బందులు వస్తాయి. సమాజం అతన్ని నిలదీసే పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు ఆ కన్నతండ్రి ఏం చేశాడు.. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు.. అనే కథాంశంతో ‘సారంగదరియా’ చిత్రం రూపొందిందని టీజర్ ద్వారా స్పష్టమవుతుంది. మధ్య తరగతి తండ్రిగా విలక్షణమైన పాత్రలో రాజారవీంద్ర చక్కగా ఒదిగిపోయారు.

ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి మాట్లాడుతూ ‘‘మా ‘సారంగదరియా’ టీజర్‌ను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణుగారికి ప్రత్యేక ధన్యవాదాలు. హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలుంటాయి. సినిమాను మే నెలలో విడుదల చేయాలనకుంటున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.

డైరెక్టర్ పద్మారావు అబ్బిశెట్టి(పండు )మాట్లాడుతూ ‘‘ మా మూవీ టీజర్ విడుదల చేసిన శ్రీవిష్ణుగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. దర్శకుడిగా ఇది నా తొలి చిత్రం. ఒక మధ్యతరగతి ఫ్యామిలీ లో జరిగిన కొన్ని ఘర్షణల తో కథ ఉంటుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మే నెలలో ప్రేక్షకుల ముందుకు రావటానికి ప్రయత్నాలు చేస్తున్నాం’’ అన్నారు.

నటీనటులు
రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్,శివ చందు, యశస్విని,మొయిన్ ,మోహిత్,నీల ప్రియా, కదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు ,విజయమ్మ , హర్షవర్ధన్, తదితరులు

సాంకేతిక వర్గం:

బ్యానర్ – సాయిజా క్రియేషన్స్, నిర్మాతలు – ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి, దర్శకత్వం – పద్మారావు అబ్బిశెట్టి (పండు), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అరుణాచల మహేష్, మాటలు – వినయ్ కొట్టి, ఎడిటర్ – రాకేష్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ – ఎం. ఎబెనెజర్ పాల్, సినిమాటోగ్రఫీ – సిద్ధార్థ స్వయంభు, పాటలు – రాంబాబు గోశాల, కడలి , అడిషనల్ రైటర్ – రఘు రామ్ తేజ్.కె, పి.ఆర్.ఒ – కడలి రాంబాబు, తుమ్మల మోహన్, చంద్ర వట్టికూటి.

Latest Articles

విత్తనాల షాపులపై అధికారుల తనిఖీలు

ఖరీఫ్‌ పంటకు అన్నదాతలు సిద్ధమయ్యారు. కాస్త ముందుగానే వరుణుడు చినుకులు కురిపించడంతో విత్తనాలకు పరుగెడుతున్నారు రైతులు. ఇదే అదునుగా వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అధిక ధరలతో రైతులను నిండా ముంచేందుకు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్