స్వతంత్ర వెబ్ డెస్క్: ఐదు టీ20ల సిరీస్‌లో 2-1తో విండీస్ జట్టు ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్ గెలిచేందుకు ఒక్క విజయం దూరంలో ఉంది. రెండూ మ్యాచ్‌లు ఓడిపోయి మరో ఓటమి ఎదురైతే సిరీస్ చేజారే పరిస్థితిలో పుంజుకున్న టీమిండియా.. మూడో టీ20లో గెలిచి హమ్మయ్య అనుకుంది. కానీ కథ అంతటితో ముగియలేదు. నాలుగో టీ20లో ఓడినా సిరీస్ చేజారిపోతుంది. ఈ నేపథ్యంలో శనివారం జరిగే నాలుగో మ్యాచ్‌లో భారత్, వెస్టిండీస్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
నాలుగో టీ20 మ్యాచ్ అమెరికాలోని ఫ్లోరిడాలో గల లాడర్‌హిల్ సిటీలో జరగనుంది. ఐదో టీ20 కూడా అక్కడే జరగనుంది. మూడో టీ20 విజయంతో ఆశలను సజీవం చేసుకున్న హార్దిక్ సేన.. నాలుగో టీ20లో కూడా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరి చివరి 2 టీ20ల కోసం అమెరికాలో అడుగుపెట్టిన భారత్ ఫలితం రాబడుతుందో వేచి చూడాల్సిందే.
తుది జట్లు (అంచనా).. భారత్: యశస్వి, శుభ్‌మన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ (కెప్టెన్), అక్షర్ పటేల్, కుల్‌దీప్, అర్ష్‌దీప్, ముకేశ్ కుమార్, చాహల్.
వెస్టిండీస్: మేయర్స్, కింగ్, చార్లెస్, పూరన్, రోమన్ పావెల్ (కెప్టెన్), హెట్‌మయర్, హోల్డర్/చేజ్, రొమారియో షెఫర్డ్, అకీల్ హొసీన్, అల్జారి జోసెఫ్, మెకాయ్.