తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనలు చేస్తున్న సీఎం రేవంత్ ని టీ కన్సల్ట్, W T I T C ఛైర్మెన్ సందీప్ కుమార్ మక్తలా టీం కలిసారు. ఇంటర్నేషనల్ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తమ వంతు కృషి చేస్తున్న టీ కన్సల్ట్… తాజాగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా పనిచేస్తున్న కంపెనీలను సీఎం దృష్టికి తీసుకెళ్లింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న 30 కంపెనీల వివరాలను, కల్పించే ఉద్యోగ అవకాశాలను సందీప్ మక్తాల టీమ్ ముఖ్యమంత్రి రేవంత్ కు వివరించారు. పెట్టు బడులు పెట్టేందుకు ముందుకొచ్చిన కంపెనీలకు అనుమతుల్లో ఇబ్బందులు రాకుండా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని సందీప్ మక్తాలా అన్నారు. కొత్త కంపెనీలు రావడం వల్ల 4 వేలకు పైగా ఉద్యోగాలు సృషించబడతయని సందీప్ మక్తాలా తెలిపారు. పెట్టుబడులంటే హైదరాబాద్ ఒక్కటే కాదని ఆదిలాబాద్ , వరంగల్ , కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ లాంటి టైర్ 2 ప్రాంతాల అభివృద్ధి జరిగేలా ప్రయత్నిస్తున్నామని టీ కన్సల్ట్ ఛైర్మెన్ సందీప్ మక్తాలా తెలిపారు.


