27.2 C
Hyderabad
Thursday, November 6, 2025
spot_img

ఏపీలో టీడీపీ గెలుపు సరే … హామీల అమలు సాధ్యమేనా?

    ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తిరుగులేని విజయం సాధించింది. అయితే.. ఇప్పుడు అందరి దృష్టీ హామీల అమలుపైనే నిలిచింది. ఎన్నికల ముందు టీడీపీ-జనసేన కలిసి ఉమ్మడి మేని ఫెస్టో విడుదల చేశాయి. మరి వాటిలో ఇచ్చిన మేరకు హామీలు అమలు చేయడం విషయంలో టీడీపీ అధినేత, కాబోయే ఏపీ సీఎం చంద్రబాబు ఎలా వ్యవహరించబోతున్నారు? ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చూస్తే హామీల అమలు అంత ఈజీగా సాగుతుందా ? ఇప్పుడు అందరిలోనూ ఇదే ప్రశ్న.

    ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఇంకా చెప్పాలంటే కూటమి అభ్యర్థుల గెలుపు నల్లేరుపై నడక అన్నట్లుగా ఆయా అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో.. త్వరలోనే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. అయితే.. ఇంతవరకు బాగానే ఉన్నా.. రేపు రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ క్రమంలోనే మొదటగా గుర్తొచ్చేది హామీల అమలు. అవును 2024 ఎన్నికల కోసం టీడీపీ-జనసేన పార్టీలు కలిసి ఉమ్మడిగా పలు ప్రజాకర్షక హామీలిచ్చాయి. సూపర్ సిక్స్‌, సూపర్ సిక్స్ 2.0 షణ్ముఖ వ్యూహం పేరుతో వీటిని తీసుకు వచ్చారు. వీటి అమలు ఏ మేరకు సక్రమంగా సాగుతుందన్న ప్రశ్నలు అప్పుడే విన్పిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్ర బడ్జెట్.

    కూటమి పార్టీలు ఇచ్చిన ప్రధానమైన హామీలను గమనిస్తే, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపా యలు ఇస్తామన్నది అత్యంత కీలకమైన హామీ. దీనికితోడు యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నెలకు మూడు వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వడం. ప్రతి రైతుకు ఏటా 20 వేల ఆర్థిక సాయం, 19 నుంచి 59 ఏళ్లలోపు మహిళలకు ప్రతి నెలా 1500 రూపాయలు, ప్రతి ఇంటికీ ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలెండర్లు ఇవ్వడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కీలకమైన హామీలు. వీటికితోడు సామాజిక భద్రత పింఛన్లను మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతామంటూ హామీ ఇచ్చారు. దివ్యాంగులకు ఆరువేల రూపాయలు, బీసీలకు యాభై ఏళ్లు నిండితే చాలు. నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. బీసీ సబ్‌ ప్లాన్‌ కింద ఐదేళ్లలో లక్షన్నర కోట్లు ఖర్చు చేయడం, స్వయం సహాయక సంఘాలకు మూడు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు అందివ్వడం. ఇలా చెబుతూ పోతే చాలానే ఉన్నాయి కూటమి ఇచ్చిన హామీలు. ఓ అంచనా ప్రకారం టీడీపీ కూటమి ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు దాదాపుగా లక్షన్నర కోట్ల రూపాయలు ప్రతి ఏటా ఖర్చు చేయాల్సి ఉంటుందన్న మాట విన్పిస్తోంది. ఇక, రాష్ట్ర బడ్జెట్‌ రెండు లక్షల కోట్ల వరకు ఉంది. అంటే హామీల అమలుకే రాష్ట్ర బడ్జెట్‌ దాదాపుగా సరిపో తుంటే,  ఇక ప్రభుత్వ కార్యకలాపాలకు, ఉద్యో గుల జీతాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు, అమరావతి నిర్మాణానికి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్ర మాలకు నిధులు సమకూర్చుకోవడం ఎలా అన్నదే ఇప్పుడు ప్రధాన అంశం.

   ఇదే అంశంపై ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ తమ మేనిఫెస్టో విడుదల సమయంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త హామీలు ఇచ్చేందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం సహకరించడం లేదని, ఇప్పుడున్న పథకాల అమలుకే అప్పులు తీసుకొస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు ఏ విధంగా సాధ్యమో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు. వైసీపీ అధినేత జగన్‌ చెప్పిన మాటల్లో నిజం లేకపోలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పులతోనే ఏపీ పాలన ప్రారంభిం చారు నాటి సీఎం చంద్రబాబు. ఆ తర్వాత జగన్ కాలంలో అవి ఎక్కువ య్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారీ హామీలు ఇచ్చిన కూటమి అధికారంలోకి రావడంతో చంద్రబాబు మరోసారి సీఎం కానున్నారు. దీంతో..ఇప్పుడు పథకాల అమలు రాష్ట్ర బడ్జెట్ దృష్ట్యా చూస్తే అంత ఈజీ కాదన్న విషయం ఎవరికైనా కాస్త ఆలోచిస్తే ఇట్టే అర్థమవుతుందన్న వాదన విన్పిస్తోంది. కానీ, టీడీపీ సహా కూటమి నేతలు మాత్రం సంపద సృష్టించి హామీలను పూర్తిగా అమలు చేస్తామంటున్నారు. దీంతో ఇప్పుడు అందరి చూపూ రాబోయే రోజుల్లో ఏం జరగుబోతోందన్న దానిపైనే నెలకొంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్