27.2 C
Hyderabad
Friday, November 22, 2024
spot_img

TDP: ఆధారాలు ఉంటే 50 రోజులుగా ఏం చేస్తున్నారంటూ- లోకేశ్ ఫైర్

స్వతంత్ర వెబ్ డెస్క్: చంద్రబాబుపై కేసులకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు.. మరి 50 రోజులుగా వాటిని బయటపెట్టకుండా ఏంచేస్తున్నారని వైసీపీ నేతలపై నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులను ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నించడం సహజమేనని, అయితే ప్రత్యర్థిని చంపాలని చూడడం వైసీపీ నేతలకే చెల్లిందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు జైలులోనే చనిపోతారంటూ వైసీపీ నేతలు చెబుతున్నారని లోకేశ్ గుర్తుచేశారు. కేసులతో ఎలాంటి సంబంధంలేని నా తల్లిని కూడా జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. స్కాంలతో తమకు కానీ, తమ పార్టీ నేతలకు కానీ, బంధుమిత్రులకు కానీ ఎలాంటి సంబంధంలేదని లోకేశ్ స్పష్టం చేశారు. ఒకవేళ ఉందని మీ దగ్గర ఏ చిన్న ఆధారం ఉన్నా ప్రజల ముందు పెట్టాలని వైసీపీ నేతలకు లోకేశ్ బహిరంగ సవాల్ విసిరారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైలులో పెట్టారని లోకేశ్ విమర్శించారు. ప్రజల నుంచి ఆయనను దూరం చేయడానికి, ప్రజా సమస్యలపై పోరాడకుండా అడ్డుకోవడానికి వైసీపీ ప్రభుత్వం ఈ నాటకం ఆడుతోందని ఆరోపించారు. అంతే తప్ప చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని లోకేశ్ తెలిపారు. టీడీపీ అధినేతను జైలులోకి పంపడంపై పెట్టిన శ్రద్ధను రాష్ట్రంలోని రైతుల సమస్యలను పరిష్కరించడంలో పెడితే బాగుండేదని అన్నారు. సౌత్ ఇండియాలోనే ఎన్ ఎస్ జీ ప్రొటెక్షన్ కలిగిన ఒకేఒక నేత చంద్రబాబు అని, ఆయనకు మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉండడంతో కేంద్రం ఈ రక్షణ కల్పించిందని చెప్పారు. అలాంటి వ్యక్తిని అన్యాయంగా జైలులో పెట్టి, సరైన రక్షణ కల్పించకపోవడం చూస్తుంటే తమకు అనుమానంగా ఉందన్నారు. తమ అధినేతను జైలులోనే అంతమొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందేమోనని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.

Latest Articles

ఏపీ బ్రాండ్‌ను మాజీ సీఎం జగన్‌ దెబ్బతీశారు – చంద్రబాబు

మాజీ సీఎం జగన్‌పై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో గంజాయి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. తల్లి, చెల్లిపై...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్