కొంత కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా కంటెంట్ ఉంటే చాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే రూపొందించిన సినిమానే ‘తంతిరం’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. దీనికి అద్భుతమైన స్పందన వస్తోంది.ఈ తంతిరం సినిమా హర్రర్ అంశాలతో కూడిన కుటుంబ కథ చిత్రంగా, భార్య భర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా ఉంటుంది అనే ఒక అందమైన ప్రేమకథతో రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ రక్తి కట్టిస్తుంది. సినిమా బండి బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా U/A సర్టిఫికెట్‌ను అందుకుంది. ఆడియో రైట్స్ అందుకున్న సరిగమ సంస్థ జ్యూక్ బాక్స్ ద్వారా ఆడియో రిలీజ్ చేసింది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా రైట్స్ కోసం ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్‌కు నార్త్ ఇండియాలో కూడా మంచి స్పందన లభిస్తోంది. పాన్ ఇండియా లెవెల్‌లో ఐదు భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా రిలయన్స్ సంస్థ గ్రాండ్‌గా అక్టోబర్ 6న రిలీజ్ చేయడానికి సిద్ధమయింది.
నటీనటులు: శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ ,అవినాష్ వెలందరు, శ్రీనివాసమూర్తి
దర్శకులు : ముత్యాల మెహర్ దీపక్
నిర్మాతలు: శ్రీకాంత్ కంద్రగుల (SK )
సంగీత దర్శకులు: అజయ్ అరసడ
సినిమాటోగ్రఫీ: సిరుగుడి వంశీ శ్రీనివాస్
ఎడిటర్ : సిరుగుడి వంశీ శ్రీనివాస్
పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను ,
దీరు – ప్రసాద్ లింగం