22.7 C
Hyderabad
Thursday, November 6, 2025
spot_img

మారుతున్న తమిళనాడు పాలిటిక్స్‌.. డీఎంకేపై ముప్పేట దాడి

తమిళనాడులో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. వచ్చే ఏడాది ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈసారి ఎలాగైనా డీఎంకేను కుర్చీ నుంచి దించి వేయాలని ప్రతిపక్షాలు గట్టిగా నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే, తమిళిగ వెట్రి కళగం, బీజేపీ ఒకే వేదిక మీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తమిళనాడులో రాజకీయ పార్టీల పునరేకీకరణ జరుగుతోంది. తమిళనాడు శాసనసభకు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికైతే అధికారంలో ఉన్న డీఎంకే రాష్ట్రమంతటా బలోపేతంగా ఉంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డీఎంకే మరోసారి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకులు బలంగా నమ్ముతున్నారు. కొన్ని నెలల కిందట జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే అఖండ విజయం సాధించింది.పుదుచ్చేరి సహా మొత్తం 40 నియోజకవర్గాల్లో ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఎన్నికల్లో అన్నా డీఎంకే అడ్రస్ గల్లంతైంది. 34 సెగ్మెంట్లలో పోటీ చేసినప్పటికీ అన్నా డీఎంకే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కాగా కనీసం ఏడు సీట్లు దక్కుతాయని భావించిన భారతీయ జనతా పార్టీకి తీవ్ర పరాజయం ఎదురైంది.కోయంబత్తూరు నుంచి పోటీ చేసిన అన్నామలై , దక్షిణ చెన్నై నుంచి బరిలో నిలిచిన తమిళిసై సౌందరరాజన్ పరాజితుల జాబితాలో చేరారు. కాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరిపాలనలో కొత్త తరహ లో దూసుకుపోయారు. జనం ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. స్టాలిన్ ఇమేజే ఇండియా కూటమిని గెలుపు తీరాలకు చేర్చింది.

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అవే ఫలితాలు రిపీట్ అవుతాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈసారి డీఎంకే జైత్రయాత్ర అంత సులభంగా కనిపించడంలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ను ఎదుర్కోవడానికి మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఒకే వేదికమీదకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అన్నా డీఎంకే, సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళిగ వెట్రి కళగం, నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఎన్నికల పొత్తు కుదిరే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇందులో ఎవరి లెక్కలు వారికున్నాయి. ఎన్నికల రణక్షేత్రంలో డీఎంకేను సవాల్ చేయడానికి ఎవరి కారణాలు వారికున్నాయి.

డీఎంకేను ఓడించడానికి ఈ మూడు ర్టీలు పక్కా ప్రణాళికలతో రెడీ అవుతున్నాయి. ద్రవిడ పార్టీల్లో అతి పెద్దదైన అన్నా డీఎంకే ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అయితే ఒంటరిగా పోటీ చేసి, డీఎంకేను ఎదుర్కొనే సత్తా అన్నా డీఎంకేకు లేదన్నది వాస్తవం. వాస్తవానికి జయలలిత మరణం తరువాత క్షేత్రస్థాయిలో అన్నా డీఎంకే బలహీనమైంది. కార్యకర్తలు అలాగే ద్వితీయ శ్రేణి నాయకులకు స్పూర్తి నిచ్చే నాయకత్వం ప్రస్తుతం అన్నా డీఎంకేలో లేదు. అన్నా డీఎంకేకు ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా డీఎంకేను వ్యతిరేకించే పార్టీలతో పొత్తు పెట్టుకునే ఆలోచనలో అన్నా డీఎంకే ఉంది.

విజయ్ దళపతి….తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఎగసి వచ్చిన కొత్త కెరటం. సినీ నటుడిగా అసంఖ్యాక అభిమానుల ఆదరణ చూరగొన్న విజయ్ కిందటేడాది ఫిబ్రవరిలో తమిళిగ వెట్రి కళగం పేరుతో ఓ కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించారు. తమిళనాడులో కొనసాగుతున్న అవినీతి పాలనపై పోరాటం చేయడానికే రాజకీయ పార్టీ పెడుతున్నట్లు విజయ్ పేర్కొన్నారు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనే తొలిసారి తమిళిగ వెట్రి కళగం పోటీ చేస్తుందని ఆయన తెగేసి చెప్పారు. అంటే 2026 ఎన్నికల్లో డీఎంకేను అధికారం నుంచి దించివేయడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని విజయ్ తెగేసి చెప్పారు. తమిళనాడులో విజయ దళపతికి మంచి స్టార్‌డమ్‌ ఉంది. ఇప్పటితరం హీరోలలో విజయ్‌ను ప్రముఖుడిగా చెబుతారు తమిళ సినీ ప్రముఖులు. హీరో విజయ్‌ను అభిమానులు ప్రేమగా దళపతి అని పిలుస్తుంటారు. విజయ్‌ కేవలం సినిమాలకే పరిమితమైన నటుడు కాదు. కొంతకాలంగా సేవారంగంలోనూ ఆయన కొనసాగుతున్నారు.

ఇక బీజేపీ విషయానికొస్తే, తమిళనాడులో ఆ పార్టీకి ఏమాత్రం బలం లేదు. ఐపీఎస్ మాజీ అధికారి అన్నామలై నాయకత్వంలో ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కోయంబత్తూరు నుంచి పోటీ చేసిన అన్నామలై కూడా ఓడిపోయారు. మౌలికంగా తమిళనాడులో రాజకీయ పార్టీలన్నీ ద్రవిడవాదం చుట్టూ తిరుగుతాయి. అయితే బీజేపీ పొలిటికల్ ఫిలాసఫీ, ద్రవిడ వాదానికి పూర్తి వ్యతిరేకం. దీంతో ఢిల్లీలో ఉండే పార్టీ పెద్దలు ఎంతగా శ్రమించినా, తమిళ సమాజంలో బీజేపీ చొచ్చుకుపోలేకపోయింది.

ఇదిలా ఉంటే తమిళనాడులో డీఎంకే పాలన విమర్శలపాలైంది. అన్నా విశ్వవిద్యాలయంలో చదువుకునే ఒక విద్యర్థిని లైంగిక వేధింపులకు గురైన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. ఇదే అంశంపై బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ గవర్నర్ రవిని తమిళ వెట్రిగ కళగం అధినేత విజయ్ కోరారు. అలాగే అన్నా డీఎంకే కార్యకర్తలు తమిళనాడు వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేశారు. అయితే బీజేపీ నేత అన్నామలై ఈ విషయంలో కొత్త తరహాలో నిరసన వ్యక్తం చేశారు. కొరడాతో శరీరంపై కొట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అలాగే డీఎంకే పరిపాలనను తూర్పార పట్టడానికి ప్రతిపక్ష పార్టీలకు మరికొన్ని ఆయుధాలు దొరికాయి. ఈ నేపథ్యంలో సామూహిక నిరసన ప్రదర్శనల ద్వారి అసెంబ్లీ ఎన్నికల నాటికి డీఎంకే వ్యతిరేక వాతావరణాన్ని తమిళనాడులో నెలకొల్పాలన్నది ఈ మూడు పార్టీల లక్ష్యంగా కనిపిస్తోంది.

అయితే ఇక్కడ ఒక చిక్కు ప్రశ్న ఎదురవుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు డీఎంకే తరఫున సహజంగా ఎంకే స్టాలనే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారు. ఈ విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయమే ఉండదు. అయితే అన్నా డీఎంకే, తమిళ వెట్రిగ కళగం, భారతీయ జనతా పార్టీ ఒక జట్టుగా ఏర్పడితే, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ఒక ప్రశ్నగా మారింది. కాగా ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం లేదన్న భావనలో ఈ మూడు పార్టీలు ఉన్నాయి. ఎన్నికల్లో గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంతటి సీట్లు లభిస్తే, ముఖ్యమంత్రి ఎవరు అనే విషయాన్ని అప్పడు చూసుకోవచ్చన్నది ఈ పార్టీల ఆంతర్యంగా కనిపిస్తోంది. మొత్తానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, ముప్పేట దాడి ఎదుర్కోబోతోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్