24.2 C
Hyderabad
Sunday, November 2, 2025
spot_img

తమిళనాట త్రిముఖ పోటీ !

    దేశంలోనే విభిన్న రాజకీయనేపథ్యంగల రాష్ట్రం తమిళనాడు. ఇక్కడ ద్రవిడపార్టీలైన డిఎంకె, ఏఐడి ఎంకేలదే ఆధి పత్యం. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు అక్కడ నామ్ కే వాస్తే.. పార్టీలే. 1960వ దశకం నుంచీ.. అటు అన్నాడిఎంకెతోనో, ఇటు డిఎంకె తోనో పొత్తు పెట్టుకోవడం ద్వారా కాంగ్రెస్ ఉనికి కాపాడుకుంటోంది. బీజేపీ దీ అదే పరిస్థితి. అలా పొత్తు పెట్టుకున్నా సింగిల్ డిజిట్ తప్ప.. బొత్తిగా ప్రభావం చూపే పరిస్థితి తమిళనాటలేదు. మోదీ ప్రభ కూడా అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో 1974లో భారత ప్రభుత్వం, శ్రీలంకకు అప్పగించిన కచ్చతీవు దీవి అంశాన్ని వివాదాస్పదం చేసి, తమిళ సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు బీజేపీ సిద్ధం కావడంతో హాట్ టాపిక్ గా మారింది.

  2024 లోక్ సభ ఎన్నికలకు తమిళనాడు సంసిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు ఏడు దశల్లో సాగుతున్నా.. తమిళనాడులో మొత్తం 39 నియోజకవర్గాలకు మొదటిదశలోనే ఏప్రిల్ 19న నిర్వహి స్తోంది ఎన్నికల కమిషన్. తమిళనాడులో జాతీయ పార్టీలు, ప్రాంతీయపార్టీలు, చిన్న చితక పార్టీలతో కలిపి 790 పైగా నామినేషన్ల దాఖలయ్యాయి. ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా తమిళనాట డిఎంకె, ఏఐఏడిఎంకె పార్టీలు రోడ్ షోలు, భారీ బహిరంగ సభలకన్నా.. ఇంటింటి ప్రచారం.. వ్యక్తిగతంగా ఓటర్ల ను కలిసి చేసే ప్రచారం పైనే దృష్టి పెట్టాయి. 2019లో డిఎంకె ఆధ్వర్యంలో ని కూటమి ఏకంగా 38 స్థానా లను కైవసం చేసుకుంది. డిఎంకె 20, కాంగ్రెస్ 8 సిపిఐ, సీపీఎం చెరో రెండు స్థానాలను గెలుచు కున్నాయి. ఈ సారి మొత్తం 39 స్థానాలు గెలుచుకునేందుకు వ్యూహం పన్నుతోంది.

 2024 లోక్ సభ ఎన్నికల్లో తమిళనాట త్రిముఖ పోటీ జరుగుతోంది. డిఎంకె ఆధ్వర్యంలో ఇండియా కూట మి, ఏఐఏడిఎంకె కూటమి, బీజేపీ ఆధ్వర్యంలో మరో కూటమి తలపడుతున్నాయి. గతంలో ఏఐఏడి ఎంకె తో జతకట్టిన బీజేపీ ఇటీ వల కాలంలో దూరమైంది. ఫలితంగా ఈ సారి మూడు స్తంభా లాట తప్పడంలేదు. డిఎంకె కూటమిలో కాంగ్రెస్, సిపిఎం,సీపీఐ, ఎండిఎంకె ముస్లీంలీగ్, కమలా హాసన్ కుచెందిన మక్కళ్ నీతి మయ్యం వంటి చిన్న పార్టీలు ఉన్నాయి. జయలలిత మరణం తర్వాత ఏఐఏడి ఎంకె చీలిపోయింది. పళని స్వామి నాయకత్వంలోకి ఏఐఏడిఎంకె వచ్చింది. ఈ కూటమిలో విజయ కాంత్ స్థాపించిన డిఎండికే, ఎస్ డిఐపీ, పురట్చి బారతం, ఫార్వర్డ్ బ్లాక్ వంటి పార్టీలు చిన్నా చితక పార్టీలు ఉన్నాయి.అన్నాడిఎంకె 32, డిఎండికె 5 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇక బీజేపీ ఆధ్వర్యంలోని కూటమిలో పిఎంకె, శశికళ బంధువు దినకరన్ పార్టీ, మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం , ఇంకా కొన్ని ఏకవ్యక్తి పార్టీలు చేరాయి.

   2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎం కె ఆధ్వర్యంలో ఘనవిజయం సాధించి ఎంకె స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు. స్టాలిన్ సర్కార్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు తమ విజయానికి తోడ్పడతా యని ఆ కూటమి భావిస్తున్నా.. వరుసగా మంత్రులు అవినీతి కుంభకోణాల్లో ఇరుక్కుపోవడం, ప్రభుత్వం పై తీవ్రంగా అవినీతి ఆరోపణలు రావడంతో ఆ కూటమి ప్రభుత్వ వ్యతిరేకతను మూట కట్టు కుంటోంది. అన్నాడిఎంకె చీలికలతో పార్టీ ఇప్పటికీ బలమైన శక్తిగా ఎదగలేక పోయింది. ఎరప్పాడి పళని స్వామి జనాకర్షణ కల్గిన నాయకుడు కాడు. పన్నీర్ సెల్వం వంటి నాయకుడికి కాస్త ప్రజల్లో మంచి పేరు ఉంటే.. అతడినీ వెళ్ల కొట్టారు ఫలితంగా ఏఐఏడిఎంకె పార్టీ, డిఎంకే కూటమికి దీటుగా పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. బీజేపీని కూడా ఏఐఏడిఎంకె దూరం చేసుకోవడం ఆ పార్టీకి పెద్ద మైనెస్ పాయింట్.

తమిళనాడులో బీజేపీని ఓ బలమైన శక్తిగా తీర్చిదిద్దాలనే చిత్తశుద్ధితో మోదీ కృషి చేస్తున్నారు. ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవల కాలంలో విస్తృతంగా తమిళనాడులో పర్యటించి ఎన్నికల షెడ్యూల్ కు ముందు పలు అభివృద్ధి కార్యక్రమా లను ప్రధాని మోదీ ప్రారంభించారు. అన్నిరాష్ట్రాలకన్నా ఎక్కువ మొత్తంలో తమిళనాడుకు నిధులు ఇస్తున్నట్లు కూడా మోదీ ప్రకటించారు. బీజేపీకి స్థానికంగా బలమైన నాయకులు లేకపోవడం ఓ లోపం వన్నియార్ల సామాజికవర్గంలో బలమైన ఓటు బ్యాంక్ కలిగిన పిఎంకెతో పొత్తు పెట్టుకోవడం ద్వారా కనీసం కొన్ని సీట్లు గెలుచుకొనే ఆశతో ఉంది.

   ఎన్నికల సమయాన వివాదాస్పదమైన అంశాలను ప్రస్తావించి తమిళుల్లో సెంటిమెంట్ రెచ్చ గొట్టేందు కు మోదీ కచ్చ తీవు అంశాన్ని లేవనెత్తారు. ఎన్నికల సమయాన బీజేపీ, కాంగ్రెస్, డిఎంకె పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణ లు చెలరేగుతున్నాయి. 1974లో ఇందిరాగాంధీ హయాంలో భారత – శ్రీలంక మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కచ్చతీవు దీవిని శ్రీలంకకు.. అప్పగించారు. ఆ ఒప్పందాన్ని ప్రస్తావి స్తూ.. తమిళనాట ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ కొత్త సమస్య మాదిరిగా వివాదం చేసేందుకు రాజకీయం చేస్తోంది. విపక్షాలను కూడగట్టి, ఇండియా కూటమిగా ఏర్పరచి ఎన్నికల సన్నాహానికి సిద్ధమ వుతున్న కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకు కచ్చతీవు కలసి వస్తుందని బిజెపి భావిం చింది. తమిళ నాట డిఎంకె, అన్నాడిఎంకె పార్టీలకు పలు దఫాలుగా కచ్చతీవు ఎన్నికల అస్త్రంగా వాడుకున్నాయి. తమిళ నాడు – శ్రీలంక జాలరుల మధ్య తరచూ ఘర్షణలకు ఆలవాలంగా మారిన కచ్చతీవు వివాదాన్ని పరిష్క రించవలసిం దిగా కోరారు. 50 ఏళ్ల నాడు కుదిరిన ఒప్పందాన్ని తిరగ తోడడం కానీ, అంతర్జా తీయంగా ఇష్యూ చేసి ఆ దీవిని వెనక్కి సాధించడం కానీ సాధ్యం కాదన్న విషయం ప్రధాని మోదీకి తెలుసు. తమిళ సెంటిమెంట్ ను రెచ్చగొట్టడం ద్వారా నాలుగు ఓట్లు పొందేం దుకు బీజేపీ ప్రయోగించిన ఆఖరి అస్తంగా కన్పిస్తోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్