22.7 C
Hyderabad
Monday, October 27, 2025
spot_img

Tamil Nadu: ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు

స్వతంత్ర వెబ్ డెస్క్: దీపావళి పండుగ వచ్చిందంటే ఉద్యోగులకు పండగే.. వెలుగుల దీపావళి(Diwali)ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ఉద్యోగులకు స్వీట్లతో పాటు బోనస్‌లు అందజేస్తూ వారిని ప్రోత్సహిస్తారు. కానీ ఇక్కడ ఓ బాస్ మాత్రం11111111 తన ఉద్యోగులకు వారి ఫేవరెట్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌(Royal Enfield bike)లతో డబుల్‌ దీపావళి సంబరాలను అందించారు. ఈ సంతోషాన్ని సోషల్‌ మీడియా(Social media)లో పంచుకున్నారు.

దీపావళి(Diwali) పండుగ సందర్భంగా తన ఉద్యోగులకు యజమాని మరిచిపోలేని గిఫ్ట్‌ను అందించారు. ఖరీదైన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌(Royal Enfield) బైక్‌లను బహుమతిగా ఇచ్చి వారిని సర్‌ప్రైజ్‌ చేశారు. ఇది ఎక్కడ జరిగింది. ఆ కంపెనీ పేరేంటి.. ఎంతమంది ఉద్యోగులకు బైక్‌లు ఇచ్చారు.. పూర్తి వివరాలు ఈ కథనంలో..

తమిళనాడు(Tamilnadu)లో క్వీన్ ఆఫ్ హిల్స్(Queen of Hills) గా పేరొందిన ఊటీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తిరుపూర్‌(Tirupur)కు చెందిన బిజినెస్‌మ్యాన్‌ శివకుమార్‌(Shivakumar)కు నీలగిరి జిల్లా కోటగిరిలో ఓ ఎస్టేట్ ఉంది. ఈ ఎస్టేట్‌లో దాదాపు 15 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారందరికీ దీపావళి బోనస్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌(Royal Enfield bike)లను శివకుమార్ అందించారు.

డ్రైవర్‌ నుంచి మొదలుకొని ఎస్టేట్‌ మేనేజర్‌ వరకు అందరికీ బోనస్‌గా శివకుమార్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లను అందించారు. కోటగిరిలోని ఎస్టేట్‌లో శివకుమార్‌(Shivakumar) క్యారెట్‌, బీట్‌రూట్‌, కోయిమలర్‌ వంటి పలు రకాల పంటలను సాగు చేస్తున్నారు. పంటల సాగులో తనకు ఎంతగానో సహకరిస్తున్న ఉద్యోగులకు శివకుమార్‌ ఏటా బహుమతులు అందజేస్తున్నారు.

ప్రతి ఏటా తమకు సర్‌ప్రైజ్‌గా గిఫ్ట్స్‌ అందజేస్తున్నారని ఎస్టేట్‌ ఉద్యోగులు అంటున్నారు. అయితే ఈ ఏడాది వినూత్నంగా తన ఉద్యోగులకు ఖరీదైన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లను బహుమతిగా అందించారు. ఉద్యోగుల కోరిక మేరకు నలుగురికి రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్(Royal Enfield Classic 350 bike), ఒకరికి హిమాలయన్ బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఏడుగురికి రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్(Royal Enfield Hunter) ఇవ్వగా మరో ముగ్గురికి యమహా రే స్కూటర్‌(Yamaha Ray Scooter)ను గిఫ్ట్‌గా అందించారు.

శివ కుమార్ తన ఉద్యోగులకు తాళాలు ఇచ్చి వారిని సంతోషపరించారు. దీపావళికి కొందరు యజమానులు కేవలం స్వీట్‌ బాక్సులు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొంటుండగా.. ఇలా ఖరీదైన బైక్‌లను ఇచ్చి వారిని సర్‌ప్రైజ్‌ చేయడం ఇతర వ్యాపారస్తులకు ఆదర్శంగా నిలవడమే అని చెప్పవచ్చు. నెటిజన్లు దీనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మా బాస్‌ గుడ్‌ బాస్‌ అంటూ ఉద్యోగులు అభినందిస్తున్నారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్ 350(Royal Enfield Classic 350) రూ. 2 లక్షల(ఎక్స్‌ షోరూమ్‌) కంటే ఎక్కువ ధరకు అమ్మకానికి దీని ఆన్-రోడ్ ధర రూ. 2.40 లక్షలు. హిమాలయన్ బైక్ చెన్నై ఆన్-రోడ్ ధర రూ. 2.60 లక్షలుగా ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ రూ. 1.69 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హంటర్‌.. మెట్రో హంటర్స్ మరియు రెట్రో హంటర్స్ అనే రెండు ఆప్షన్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. మెట్రో హంటర్స్(Metro Hunters) యూత్‌కి నచ్చేలా ఆధునిక ఫీచర్లతో రూపొందించారు. ఇది డ్యూయల్ టోన్ కలర్, కాస్ట్ అల్లాయ్ వీల్స్, వెడల్పాటి ట్యూబ్‌లెస్ టైర్లు, స్ప్లిట్ అల్యూమినియం రియర్ గ్రాబ్ రైల్ మరియు సర్క్యులర్ రియర్ లైట్లతో వస్తుంది.

ఇంతలో, రెట్రో హంటర్‌ను సింగిల్‌ టోన్‌ కలర్‌తో రూపొందించారు. ఇది స్క్వేర్డ్-ఆఫ్ డిఫ్యూజర్‌లు, ట్యూబ్యులర్ రియర్ గ్రాబ్ రైల్స్ మరియు స్టైలిష్ స్పోక్ వీల్స్‌తో ఆకర్షణీయంగా ఉంది. ఇంకా డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్, అనలాగ్ స్విచ్ క్యూబ్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, ఆన్ ది గో ఛార్జింగ్ (సెల్ ఫోన్ ఛార్జింగ్ సదుపాయం) వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్