స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తమిళ సినీ ఇండస్ట్రీలో వరుస విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ ఉదయం హీరో విక్రమ్‌కు సినిమా షూటింగ్ లో తీవ్రగాయాలు కాగా.. తాజాగా ప్రముఖ హాస్యనటుడు మనోబాల(69) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మనోబాల మృతితో తమిళ సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మరణవార్త పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరచితమైన మనోబాల.. వాల్తేరు వీరయ్య, మహానటి, దేవదాసు, రాజ్‌దూత్ వంటి చిత్రాల్లో నటించారు. తన మార్క్ కామెడి టైమింగ్‌తో ఎంతోమంది అభిమానులను ఆయన సంపాదించుకున్నారు.