బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్.. కత్తి దాడి తర్వాత కోలుకున్నారు. జనవరి 16న తెల్లవారుజామున ఒక అగంతకుడు తన బాంద్రాలోని ఇంటిలోకి ప్రవేశించి ఆయనపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సైఫ్ లీలావతి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. అనంతరం వైద్యులు ఆయనకు శస్త్రచికిత్సలు చేశారు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తరువాత, నటుడు బొంబాయి టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ రాత్రి ఏమి జరిగిందో గుర్తు చేసుకున్నాడు.
సైఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. తనను కత్తితో పొడిచినట్టు తాను మొదట గ్రహించలేకపోయానని అన్నాడు. ” నాకు నొప్పిగా ఉందని చెప్పాను. నా వీపు భాగంలో ఏదో జరిగిందని గుర్తించాను. ఆమె (కరీనా కపూర్) మీరు ఆసుపత్రికి వెళ్లండి. నేను నా సోదరి ఇంటికి వెళ్తాను అని చెప్పింది. ఆమె ఫోన్ కాల్స్ చేస్తోంది.. కాని ఎవరూ లేపలేదు . అప్పుడు తైమూర్ కూడా నన్ను అడిగాడు – ‘మీరు చనిపోతారా?’ నేను ‘లేదు’ అని చెప్పాను ” అని సైఫ్ ఇంటర్వ్యూలో ఘటన జరిగిన రోజు రాత్రి జరిగిన సంభాషణ గురించి వివరించాడు.
లీలావతి ఆస్పత్రి వైద్యులు మీడియాతో మాట్లాడినప్పుడు.. సైఫ్ అలీఖాన్ తన కుమారుడు తైమూర్ అలీఖాన్ తో కలిసి ఆస్పత్రికి వచ్చారని చెప్పారు. అయితే ఘటన జరిగినప్పుడు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం.. సైఫ్ అలీఖాన్ ని తన మొదటి భార్య కుమారుడు ఇబ్రహీం తీసుకొచ్చారని కథనాలు వచ్చాయి.
కత్తి దాడి తర్వాత తైమూర్ స్పందన ఏంటని సైఫ్ అలీఖాన్ ను ప్రశ్నించగా.. “తైమూర్ చాలా కూల్ గా ఉన్నాడు, ‘నేను మీతో వస్తున్నాను’ అని చెప్పాడు. నాకు ఏమైనా జరిగితే ఆ సమయంలో నేను అతనిని చూస్తే చాలా ఓదార్పు పొందుతున్నాను అని అనిపించింది. అలాగే నేను ఒంటరిగా వెళ్లాలని అనుకోలేదు ” అని సైఫ్ చెప్పారు.
“నాకు తైమూర్ ఎంత ముఖ్యమో తెలిసి నా భార్య నా వెంట పంపించింది. అది సరైన సమయం కాకపోవచ్చు.. కానీ కరెక్టే అనిపించింది. దేవుడు వేరుగా ఆలోచించి ఉంటే ఆ సమయంలో తైమూర్ నా దగ్గర ఉండాలని భావించాను. తైమూర్ కూడా నాతో రావాలని భావించాడు. అందుకే నేను, తైమూర్, హరి.. ముగ్గురం కలిసి ఆటో రిక్షాలో ఆస్పత్రికి వెళ్లాము”.. అని సైఫ్ అన్నారు.
ఆరు రోజుల తరువాత, సైఫ్ అలీ ఖాన్ జనవరి 21 న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. దాడి తరువాత అతను గత వారం నెట్‌ఫ్లిక్స్ కార్యక్రమంలో పబ్లిక్ ముందు కనిపించారు. సిద్ధార్థ్ ఆనంద్ ఓటీటీ డెబ్యూ జ్యుయెల్ థీఫ్ లో సైఫ్ అలీ ఖాన్.. జైదీప్ అహ్లావత్ తో కనిపించనున్నారు.