ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా గతంలో ఎన్నికల సందర్భంగా గొడవలు జరిగిన ప్రాంతాలపై ఫోకస్ చేశారు. ఆ పోలింగ్ బూత్‌ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లపై నిఘా ఉంచారు. మరోవైపు రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ సైతం ఇస్తున్నారు. సత్ప్రవర్తన కలిగి ఉండాలని, ప్రచారం, ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘ టనలకు పాల్పడవద్దని సూచిస్తున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో రహమత్‌నగర్, షేక్ పేట, యూసుఫ్ గూడ, బోరబండ, వెంగళరావునగర్, ఎర్రగడ్డ డివిజన్ల పరిధిలో మొత్తం 7 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో 105 మంది రౌడీషీటర్లు ఉన్నారు. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో 29 మంది కమ్యూనల్ రౌడీలు రికార్డుల్లో కెక్కారు. ప్రతిరోజూ ఆయా రౌడీషీటర్లను తని ఖీలు చేస్తున్నట్లుగా ఫొటోలు తీస్తూ ఉన్నతాధికారులకు అప్‌లోడ్ చేస్తున్నారు. దీంతో రౌడీషీటర్లలో కొంత భయం ఉంటుందంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రౌడీషీటర్లు నిబంధనలు ఉల్లంఘించి వివాదాల జోలికి వెళ్లినట్లుగా పోలీసు రికార్డులు చెబుతున్నాయి. దీంతో ఈసారి ఎన్నికల సమయంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు పోలీసులు.