స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తమిళనాడులో జల్లికట్టుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రాష్ట్రంలో జల్లికట్టును నిషేధించాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. తమిళనాడు సంప్రదాయాలకు ప్రతీకైన జల్లికట్టుపై ఎలాంటి నిషేదం లేదని పేర్కొంది. జంతు హింస చట్టం జల్లికట్టుకు వర్తించిందని స్పష్టం చేసింది. పోటీల్లో పూర్తి భద్రతా ప్రమాణాలు కల్పిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిందని తెలిపింది. జల్లికట్టుకు అనుకూలంగా తీర్పు రావడంతో తమిళనాడు ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా 2017లో అప్పటి తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టుకు అనుకూలంగా చట్టం చేసిన సంగతి తెలిసిందే.