స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: అమరావతిలో పేదలకు సుప్రీం కోర్టు గుడ్ న్యూస్ తెలిపింది. వారికి ఇచ్చే ఇళ్ల స్థలాల కేటాయింపులకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్5 జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని.. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తీర్పు వెల్లడించింది. ఈ మేరకు అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్లపై జస్టిస్ కె ఎం. జోసెఫ్ , జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పును వెలువరించింది.