Superstar RajaniKanth | సూపర్ స్టార్ రజినీకాంత్ త్వరలో ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఈనెల 28వ తేదీన విజయవాడకు రానున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు సూపర్ స్టార్ విజయవాడకు వస్తున్నారని తెలుస్తోంది. బెజవాడ పోరంకి లోని అనుమోలు గార్డెన్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు, ఎన్టీఆర్ తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ రజనీకాంత్ తో కలిసి పాల్గొననున్నారు.