స్వతంత్ర వెబ్ డెస్క్: కన్నడలో సంచలన విజయం సాధించిన “తారకాసుర” మూవీ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. శ్రీజా మూవీస్ పతాకంపై “విజయ్ భాస్కర్ రెడ్డి పాళ్యం” సినిమాను తెలుగులో అందిస్తున్నారు. రవికిరణ్ – మాన్విత హరీష్ జంటగా నటించిన మూవీలో హాలీవుడ్ నటుడు డేని సపని కీ రోల్ పోషించారు. “పద్మశ్రీ” ఫేమ్ చక్రవర్తి, తృప్తి శుక్లా సెకండ్ హీరో హీరోయిన్లుగా, శాంసన్ యోహాన్ విలన్‌గా నటించిన ఈ సినిమాకు చంద్రశేఖర్ బండియప్ప దర్శకత్వం వహించారు.
ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. నిర్మాత విజయ్ భాస్కర్ రెడ్డి, విలన్ పాత్ర ధారి శాంసన్ యోహాన్, సెకండ్ హీరోయిన్ తృప్తి శుక్లా, సెకండ్ హీరో పద్మశ్రీ ఫేమ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ దర్శకులు నగేష్ నారదాసి, ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్, పద్మిని నాగులపల్లి ముఖ్య అతిథులుగా హాజరై… కన్నడలో ఘన విజయం సాధించిన “తారకాసుర” చిత్రం తెలుగులోనూ సంచలనం సృష్టించాలని అభిలషించారు.
శ్రీజా మూవీస్ అధినేత విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ… “తెలుగులో “తారకాసుర” చిత్రానికి కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నామని తెలిపారు. ఆ పార్ట్ షూటింగ్ కూడా చేస్తున్నామని వివరించారు. తమ బ్యానర్ నుంచి త్వరలో ఒక స్ట్రెయిట్ సినిమా కూడా ప్లాన్ చేస్తున్నామని వివరించారు.