హైదరాబాద్: సూచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో సర్ సీవీ రామన్ యంగ్ జీనియస్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ పాల్గొన్నారు. ఇతర అతిథులతో కలిసి విద్యార్థులకు పురస్కారాలు అందించారు.
ప్రముఖ సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్ 31వ సర్ సివి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ, రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించింది. 1500 పాఠశాలల నుండి 1,00,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన 31వ జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షల్లో 16 మందికి గోల్డ్ మెడల్స్, 16 మంది ర్యాంకేర్స్ కి మరియు 396 డిస్ట్రిక్ ర్యాంకేర్స్ కి, 8 మందికి చత్రాలయా పురస్కార్ అవార్డ్స్, 8 మందికి గురు బ్రహ్మ అవార్డ్స్, రాష్ట్రా స్థాయి మెడల్స్, జిల్లా స్థాయి ర్యాంక్స్ వచ్చిన యువ టాలెంట్ విద్యార్థులకు శ్రీ సత్యసాయి నిగమాగమంలో అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సూచిరిండియా ఫౌండేషన్ నిర్వహకులు లయన్ కిరణ్ మాట్లాడుతూ.. ‘‘30 ఏళ్లుగా ఈ అవార్డ్స్ అందచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు స్ఫూర్తి అబ్దుల్ కలామ్ గారు. మనం దేశానికి ఏదో ఒక విధంగా సేవ చేయాలి.’’ అని పేర్కొన్నారు.