Free Porn
xbporn
24.7 C
Hyderabad
Tuesday, September 17, 2024
spot_img

ప్రభుత్వ పాఠశాలలపై ఆసక్తి చూపని పల్లెలు

   ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మార్చుతానని మాట మార్చిన కేసీఆర్ వైఖరినే సీఎం రేవంత్ ఫాలో అవుతున్నాడా? కనీస మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టకుండానే విద్యార్థులకు వెల్ కమ్ చెప్పేందు కు రేవంత్ సర్కార్ సిద్దమైందా? నా మనుమడు, నర్సయ్య మనుమడు ఓకే స్కూల్లో చదవాలని అప్పట్లో కేసీఆర్ మభ్య పెడితే, ప్రభుత్వం ఏర్పడి 5 నెలలే అయ్యిందనీ ఇప్పుడు సీఎం రేవంత్ అంటున్నారు. ఇంటర్నేషనల్ స్థాయికి విద్యను తీసుకెళ్తామన్న ప్రభుత్వం ముందు టాయిలెట్లు, తాగు నీళ్లు, శుభ్రత లాంటి కనీస అవసరాల మీద ముందు దృష్టి పెట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది.

   ప్రభుత్వాలు ఎన్ని మారినా సర్కారు బడుల దుస్థితి మారడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా 30 వేల 3 వందల ప్రభుత్వ స్కూళ్లలో దాదాపు 29 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా 10 వేల ప్రైవేట్ స్కూళ్లలో 30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లతో పోల్చుకుంటే ప్రభుత్వ స్కూళ్ల లో ఉచితంగా బుక్స్, యూనిఫామ్, భోజనం, విద్య అందిస్తున్నప్పటికీ పేద, మధ్యతరగతి కుటుం బాలు ప్రైవేట్ సూళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నంత విశాలమైన ఆటస్థలం, ఆహ్లాదకరమైన వాతావరణం ప్రైవేట్ స్కూళ్లలో చాలా తక్కువ ఉంటుంది. గవర్నమెంట్ కంటే ప్రైవేట్ స్కూళ్లకు తల్లిదండ్రులు మొగ్గు చూపడానికి కొన్ని కారణాలున్నాయని విద్యా వేత్తలు, సంఘాల నాయ కులు చెబుతున్నారు.

   ప్రభుత్వ పాఠశాలలో 12 మౌలిక సదుపాయాలను కల్పించి ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా మారుస్తామని చెప్పిన గత ప్రభుత్వం దానిని విస్మరించింది. రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల పాఠశాలలు న్నాయి. మూడు విడతల్లో వీటిని అభివృద్ధి చేస్తామని చెప్పి రెండేళ్లలో వెయ్యి స్కూళ్లను మాత్రమే గత ప్రభుత్వం పట్టించుకుంది. ప్రస్తుతం ఇదే ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను ఉపాధ్యాయులను ఆందోళనలో పడేసింది. ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్, గ్రీన్ చాక్ బోర్డు, పాఠశాల పారిశుద్ధ్య కార్మికులు, మంచినీటి సౌకర్యం లాంటి కనీస సౌకర్యాలు లేని స్కూళ్లు ఉన్నాయి. వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని విద్యార్థి సంఘాలు సూచిస్తు న్నాయి.

    గతేడాది 12 వందల ప్రభుత్వ స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. 13 వేల స్కూళ్లలో 50 మంది విద్యార్థులే కొనసా గారు. ప్రతి ఏడాది బడి బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా విద్యార్థుల శాతం పెరగడం లేదు. విద్యార్థులకు తగ్గ ఉపాధ్యాయులు, స్కిల్, కంప్యూటర్ ల్యాబ్స్, స్పోర్ట్స్ లాంటి సౌకర్యాలను ప్రతి స్కూల్‌కి చేర్చినప్పుడే ప్రభుత్వ బడులు ప్రైవేట్‌ కు ధీటుగా మారుతాయి.జూన్‌ 12 నుంచి తెలంగాణలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో వసతులు ఎక్కువైనా తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. ప్రైవేట్ స్కూళ్లవైపు మొగ్గు చూపుతున్న తల్లిదండ్రులు. ఈ ఏడాదైనా గవర్నమెంట్‌ స్కూళ్లలో తమ పిల్లలను చేరుతారో లేదో చూడాలి.

Latest Articles

చట్టం ప్రకారం వారిని సస్పెండ్ చేయడమే కాదు, అరెస్ట్‌ చేయాలి – డొక్కా

సినీనటి కాదంబరి జత్వాని పట్ల నీచంగా వ్యవహరించిన పోలీసు అధికారులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయటాన్ని టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్‌ స్వాగతించారు. చట్టం ప్రకారం వారిని సస్పెండ్ చేయడమే కాదు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్