స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ విద్యా దినోత్సవ వేడుకల్లో అపశృతి హన్మకొండ కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామంలో మంగళవారం జరిగిన తెలంగాణ విద్యా దినోత్సవం వేడుకల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ విద్యా దినోత్సవం పండుగ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో 6వ తరగతి విద్యార్థి ట్రాక్టర్ ఢీకొని మృతి చెందిన ఘటన హృదయ విదారకంగా మారింది. విద్యా దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ర్యాలీలో జయపాల్ కుమారుడు ఇనుగాల ధనుష్ తన తోటి విద్యార్థులతో కలిసి నడుచుకుంటూ వెళుతుండగా, రోడ్డు పక్కన ఉన్న కుక్క ఒక్కసారిగా ధనుష్‌పై దాడికి ప్రయత్నించింది. ఊహించని సంఘటనతో ఆశ్చర్యపోయిన బాలుడు కుక్క నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, అయితే అతను ప్రయాణిస్తున్న ట్రాక్టర్ చక్రం కిందకు వచ్చాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు.