ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. వారిపై ఎస్మా కింద చర్యలు తీసుకోవాలన్నారు. పంటల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడకుండా చూడాలన్నారు. రైతులను వేధిస్తే ఊరుకునేది లేదని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా కలెక్టర్లు చూడాలన్నారు. ఇబ్బందులుంటే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని రేవంత్‌రెడ్డి చెప్పారు.