37.5 C
Hyderabad
Thursday, April 24, 2025
spot_img

నిద్రాహారాలు మాని మైనంపల్లిని ఓడిస్తా… బీఆర్‌ఎస్‌ నేత శపథం

స్వతంత్ర వెబ్ డెస్క్: నిద్రాహారాలు మాని… మైనంపల్లిని ఓడిస్తానని శపథం చేశారు బీఆర్‌ఎస్‌ నేత నందికంటి శ్రీధర్. తెలంగాణ మంత్రి కేటీఆర్ సమక్షంలో నందికంటి శ్రీధర్ బిఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా నందికంటి శ్రీధర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీకి ఎంతగానో కష్టపడి పని చేశామని… కాంగ్రెస్ పార్టీలో బీసీలకు స్థానం లేదని అర్థం అయిన తర్వాత భారత రాష్ట్ర సమితిలో చేరేందుకు వచ్చామన్నారు.

ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు మద్దతు ఇస్తున్న అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసేందుకు బిఆర్ఎస్ లోకి వచ్చామని వివరించారు నందికంటి శ్రీధర్. మల్కాజిగిరి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని.. నిద్రాహారాలు మాని అయినా సరే మైనంపల్లి హనుమంతరావుని ఓడించి, మల్కాజిగిరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తానన్నారు. మేడ్చల్ జిల్లాలో అత్యధిక మెజార్టీతో మల్కాజిగిరి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని వెల్లడించారు నందికంటి శ్రీధర్.

Latest Articles

ముక్కురాజ్ మాస్టర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆర్ నారాయణమూర్తి

తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్(టీఎఫ్‌టీడీడీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు సాయిరాజు రాజంరాజు అలియాస్ ముక్కురాజు మాస్టర్ విగ్రహ ఆవిష్కరణ వేడుక బుధవారం ఉదయం ఘనంగా జరిగింది. టీఎఫ్‌టీడీడీఏ కార్యాలయం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్