Stack Markets | దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలతో మొదలయ్యాయి. ఈరోజు ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్ 760 పాయింట్ల నష్టంతో 59,670 దగ్గర ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 189 పాయింట్లు నష్టంతో 17,638 దగ్గర కొనసాగుతోంది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఐదు పైసలు తగ్గి 81.90 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో పవర్‌గ్రిడ్,హెచ్‌యూఎల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, యాక్సిస్ బ్యాంక్, టైటన్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌ఫార్మా, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. మిగితా కంపెనీలైన ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.


