స్వతంత్ర వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలు పెట్టాయి. ఉదయం 9.17 సమయంలో నిఫ్టీ 74 పాయింట్లు పెరిగి 19,431 వద్ద, సెన్సెక్స్ 240 పాయింట్లు పెరిగి 65,584 వద్ద ట్రేడవుతున్నాయి. మజెగావ్ డాక్, మోతీలాల్ ఓస్వాల్, జేకే ఇన్ఫ్రా, పీసీబీఎల్, బేయర్ క్రాప్‌సైన్స్ షేర్ల విలువ పెరగ్గా.. కేపీఐటీ టెక్నాలజీస్, ఐనాక్స్, యూపీఎల్, వేదాంత, గాడ్‌ఫ్రేఫిలిప్స్ షేర్ల విలువ కుంగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత బలపడి రూ.82.40 వద్ద నేటి ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది.
పన్ను వసూళ్లలో పెరుగుదల ఆర్థిక వ్యవస్థ పుంజుకొంటోదనే సంకేతాలను మార్కెట్‌కు ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.4.75 లక్షల కోట్ల నికర పన్ను వసూళ్లు నమోదయ్యాయని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే 16 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది.