విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్ వైభవం కోసం తమ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషిచేస్తోందని సీఎం జగన్ అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి చేస్తూనే ఉందని చెప్పారు. మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభానికి ముందు ఎండాడ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖ ఉక్కు కర్మాగారం సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు కార్మిక సంఘాల నాయకులు. ఈ సందర్భంలో స్టీల్ ప్లాంట్ విషయంలో తమది రాజీ లేని ధోరణి సీఎం స్పష్టం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్ వైభవానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, వైయస్సార్సీపీ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులకు అండగా నిలుస్తుందని చెప్పారు. ఈ సమస్యపై మొదటిసారిగా కార్మికుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే గళమెత్తిందని తెలిపారు. తొలిసారిగా ప్రధానికి లేఖ కూడా రాశామని, స్టీల్ ప్లాంట్ కర్మాగారం అంశంపై పరిష్కారాలు కూడా సూచించామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని సీఎం జగన్ గుర్తు చేశారు.


