కాంగ్రెస్ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. విద్యా, ఉపాధి, రాజకీయాల్లో పూలే ఆలోచనలను ముందుకు తీసుకె ళ్లామని తెలిపారు. అలాగే బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చింది తామేనన్న ఆయన… బడ్జెట్‌లో బీసీలకు 20వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.


