స్వతంత్ర వెబ్ డెస్క్: కొంతమంది ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా, చేతి నిండా డబ్బు సంపాదిస్తున్నా.. ఏదో ఒక లోటు వారిని సంతృప్తిగా ఉండనివ్వదు. అందుకే ఏదో ఒక సమయంలో అన్నీ వదిలేసి తమకు నచ్చిన పనిలో సంతృప్తిని వెతుక్కుంటారు. ఇలాంటి కోవకే చెందుతాడు భారత సంతతికి చెందిన టెక్కీ రాహుల్ పాండే(Rahul Pandey). ఇతడు ఇప్పుడు పెద్ద ఎటర్‌ప్రెన్యూర్. సొంత స్టార్టప్(Startup)ను ప్రారంభించి సక్సెస్ అయ్యి.. సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా పాపులర్ అయ్యాడు. అయితే అంతకు మించిన ఆశ్చర్యం ఒకటి ఉంది. అదేంటంటే.. ఈ స్టార్టప్ కోసం మెటా ప్లాట్‌ఫామ్(Meta Platform)లో (గతంలో ఫేస్‌బుక్) అతడు ఉద్యోగం మానేశాడు. ఏకంగా రూ.6.6 కోట్ల ప్యాకేజీని వదులుకొని రాహుల్ సొంత స్టార్టప్(Own startup) ప్రారంభించాడు.
రాహుల్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ(Stanford University)లో చదివి, ఫేస్‌బుక్(Facebook)లో ఉద్యోగం సాధించాడు. దాదాపు ఐదు సంవత్సరాలు పని చేసి, అనంతరం ఉద్యోగాన్ని వదిలేశాడు. ఇప్పుడు టారో (Taro) పేరుతో ఒక స్టార్టప్(Startup)ను రన్ చేస్తున్నాడు. తాజాగా రాహుల్ తన జర్నీ గురించి బిజినెస్ ఇన్‌సైడర్ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడారు.
ఫేస్‌బుక్ కంపెనీలో ప్రయాణం
‘ఫేస్‌బుక్(Facebook)లో చేరిన తర్వాత మొదటి ఆరు నెలలు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఒక సీనియర్ ఇంజనీర్‌గా కంపెనీ కల్చర్, టూలింగ్‌కు అలవాటు పడటానికి నేను చాలా కష్టపడ్డాను. సీనియర్ ఇంజనీర్(Senior Engineer)గా ఉండటానికి అర్హత లేని వ్యక్తిగా భావిస్తారనే భయంతో ఎప్పుడూ సహోద్యోగుల సహాయం అడగలేదు.’ అని రాహుల్ లింక్డ్‌ఇన్(LinkedIn)లో రాశారు. అదే సమయంలో రాహుల్ ఉద్యోగంలో చేరిన ఒక సంవత్సరంలోనే, ఫేస్‌బుక్ అంతర్గతంగా పోరాటాలను ఎదుర్కొంది. అప్పట్లో కంపెనీ స్టాక్ విలువ కూడా పడిపోయింది. దీంతో చాలామంది సంస్థలో ఉద్యోగాలను వదిలేశారు. అయితే రాహుల్ మాత్రం ఈ విషయంలో ఇతరులను అనుసరించలేదు.
ప్రమోషన్
ఈ విషయంపై రాహుల్ బిజినెస్ ఇన్‌సైడర్‌తో మాట్లాడారు. ‘నేను కంపెనీలో కేవలం ఒక సంవత్సరం మాత్రమే ఉన్నాను. కాబట్టి వేరే కంపెనీకి మారడం మరీ తొందరపాటు పని అవుతుంది అనిపించింది. ఇందుకు బదులుగా పనితీరును మెరుగుపరచుకోవడానికి గట్టి ప్రయత్నం చేశాను’ అని చెప్పారు. ఫేస్‌బుక్(Facebook)లో ఉద్యోగంలో చేసిన రెండో సంవత్సరం చివర్లో రాహుల్(Rahul) ఒక ఇంటర్నల్ టూల్‌ను డెవలప్ చేశారు. ఇంజనీర్లకు చాలా సమయాన్ని ఆదా చేసిన ఈ ఇన్వెన్షన్‌తో ప్రమోషన్ సైతం పొందాడు. దీంతో అతని బేసిక్ పేతో పాటు రూ.2 కోట్ల విలువైన ఈక్విటీని కంపెనీ మంజూరు చేసింది. అయితే ఆ తర్వాత కోవిడ్-19 మహమ్మారి విజృంభించింది. దీంతో రాహుల్ కొత్త అవకాశాల కోసం వెతకడం ప్రారంభించారు.
“ఫేస్‌బుక్ కంపెనీ(Facebook Company)లో ఉద్యోగం మానేసే సమయానికి నేను మేనేజర్ రోల్‌లో ఉన్నాను. 2021 చివర్లో మెటా(Meta) కాకుండా ఇతర సంస్థల్లో అవకాశాలు వెతకడం ప్రారంభించాను. ఈ రంగంలో దాదాపు ఒక దశాబ్దం తర్వాత కొంతవరకు ఆర్థిక స్వేచ్ఛ సాధించాను. అదే సమయంలో ఇంజనీరింగ్‌కు మించి చాలా నేర్చుకోవాలని గ్రహించాను” అని రాహుల్ వెల్లడించారు. 2017 ఆగస్టులో ఫేస్‌బుక్ కంపెనీలో చేరిన రాహుల్, చివరకు గత సంవత్సరం జనవరిలో ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కెరీర్ డెవలప్‌మెంట్ కోసం సహాయపడే సొంత స్టార్టప్‌ను ప్రారంభించారు. దీన్ని టారో (Taro) పేరుతో లాంచ్ చేశారు.‘2021లో నా మొత్తం రెమ్యునరేషన్ $800,000 (సుమారు రూ. 6.6 కోట్లు) దాటింది. మెటా స్టాక్ వాల్యూ(Meta stock value) పెరగడం ఇందుకు దోహదం చేసింది. దీంతో ఎక్కువ ఆదాయాన్ని ఆర్చించే వ్యక్తుల జాబితాలో చేరాను. అయితే ఇందుకు అదృష్టం సైతం తోడుండాలి’ అని రాహుల్ తెలిపారు.