పశ్చిమాసియాలోని అరబ్ దేశాలలో ఒకటైన యెమన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో 78 మంది మృత్యువాత పడ్డారు. సనాలోని ఓల్డ్ సీటీలో వ్యాపారులు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డబ్బు తీసుకునేందుకు వందలాదిగా ప్రజలు కిక్కిరిసిపోవడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రజలు గుమిగూడడటంతో వారిని నియంత్రించేందుకు సాయుధ హౌతీలు గాల్లో కాల్పులు చేశారు. దీంతో బయపడిపోయిన అక్కడి ప్రజలు… వేగంగా పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో మృతి చెందారు. స్థానిక అధికారులతో చెప్పకుండా నిధులను యాదృచ్ఛికంగా పంపిణీ చేయడం, గాల్లో కాల్పులు జరపటం వల్లే ఇంతమంది చనిపోయారని అధికారులు అంటున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నా మని… ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.