సికింద్రాబాద్: స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘ఇంటింటి రామాయణం’ సీరియల్ జంట శ్రీకర్, పల్లవి ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి సిక్కు విలేజ్‌లోని ఉమానగర్ కాలనీ, అక్బర్ రోడ్‌లోని వీహెచ్‌ఆర్ బాంక్వెట్ హాల్ 16లో ఈ కార్యక్రమం జరిగింది.
అక్షయ్, అవని వారి కుమార్తె ఆరాధ్యతో కలిసి హోస్ట్ చేసిన ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్‌లోని కమ్యూనిటీ ప్రేక్షకులు భారీగా తరలి వచ్చారు. బుల్లితెర తారలతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. ఇంటింటి రామాయణం కుటుంబీకులకు పూలవర్షం కురిపించి మెట్టెలు, బాసికం వంటి అందమైన బహుమతులను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు ప్రేక్షకులు.
సీరియల్‌లోని వివాహ ఎపిసోడ్‌లను ప్రమోట్ చేస్తూ అవని, అక్షయ్ దండలు మార్చుకుంటూ నృత్యం చేశారు. స్టార్ మాలో ప్రతి సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 8:30 గంటలకు ఇంటింటి రామాయణం ప్రసారం అవుతోంది.


