36.1 C
Hyderabad
Thursday, April 24, 2025
spot_img

ఎస్వీసీసీ బ్యానర్‌లో గోపీచంద్ కొత్త సినిమా ప్రారంభం

ప్రతిష్టాత్మకమైన, అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థ, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మార్గదర్శకత్వంలో వరుసగా సక్సెస్‌లను సాధిస్తోంది. ప్రస్తుతం ఈ ఈ విజయవంతమైన నిర్మాణ సంస్థ మాచో స్టార్ గోపీచంద్‌తో సినిమా చేయబోతోంది. ‘సాహసం’ తర్వాత గోపీచంద్ మళ్లీ ఈ బ్యానర్‌లో సినిమా చేస్తున్నారు. అలాంటి ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురువారం (ఏప్రిల్ 24) నాడు అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఆసక్తికరమైన థ్రిల్లర్‌తో కుమార్ సాయి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. సాహసం తర్వాత ప్రతిభావంతులైన సినిమాటోగ్రాఫర్ శామ్‌దత్ ISC కూడా ఈ టీంలో జాయిన్ అయ్యారు.

ఈ టీం బాక్సాఫీస్ వద్ద మరో సారి సంచలనాన్ని సృష్టిస్తుండటం ఖాయమనిపిస్తోంది. అద్భుతమైన కథనం, గోపీచంద్ యాక్షన్, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ చిత్రం రాబోతోంది. ఈ మూవీ అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మలయాళ నటి మీనాక్షి దినేష్ ఈ థ్రిల్లర్‌లో గోపీచంద్ సరసన కథానాయికగా నటించనుంది.

బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బాపినీడు సమర్పిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. నటీనటులు, ఇతర సిబ్బంది గురించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

నటీనటులు – గోపీచంద్, మీనాక్షి దినేష్ తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ – శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC)
సమర్పణ – బాపినీడు
నిర్మాత – బివిఎస్ఎన్ ప్రసాద్
దర్శకుడు – కుమార్ సాయి
డిఓపి – శామ్‌దత్ ISC

Latest Articles

టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: చరిత్ర, సంస్కృతి మరియు విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్