IPL 2023 |క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మ్యాచ్ లు మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ మార్చి 31న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఈ మెగా టోర్ని కోసం బీసీసీఐ అన్ని సన్నాహాలు చేస్తోంది. కోవిడ్ కారణంగా గత మూడేళ్లుగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్యాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న తన డ్యాన్స్‌తో అభిమానులను అలరించనుంది. అలాగే తమన్నా భాటియా కూడా స్టెప్పులు వేయనుందట. ఇక ఫేమస్ బాలీవుడ్ సింగర్ అరిజిత్ సింగ్ కూడా తన గొంతును వినిపించనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల మహిళల ఐపీఎల్‌కు ముందు కూడా ప్రారంభం వేడుకలు నిర్వహించారు. అయితే పెద్దగా సినీ గ్లామర్ లేకపోవడంతో ఆ వేడుక పెద్దగా ఆకట్టుకోలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని IPL 2023 ప్రారంభ వేడుకను గ్రాండ్ గా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఇందుకోసం రష్మిక, తమన్నా లాంటి పాన్ ఇండియా బ్యూటీలను రంగంలోకి దించాలనుకుందట. వీరితో పాటు మరికొంత మంది మేల్, ఫిమేల్ పాన్ ఇండియా ఆర్టిస్ట్‌లు ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొంటారని తెలుస్తోంది.
Rashmika Mandanna Likely to Perform in the Opening Ceremony IPL#INDvsAUS #SuryakumarYadav #IPL2023 pic.twitter.com/tede4fpK8g
— Cricketwala.in (@Cricketwala22) March 22, 2023
Read Also: నేడు టీడీపీలో చేరనున్న వైసీపీ అసమ్మతి నేత..
Follow us on: Youtube Instagram