తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరిస్తున్నాయి. ద్రోణి ఉత్తరాంధ్ర మీదుగా తూర్పు, పడమర మధ్య సముద్ర మట్టానికి 3.1 కి.మీ నుంచి 5.8 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది. వచ్చే 24 గంట ల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వాతావ రణ శాఖ తెలిపింది.
రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అధికారుతు తెలిపారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేశారు. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని సూచించారు.


