స్వతంత్ర వెబ్ డెస్క్: కొన్నిసార్లు నిజం.. కొన్నిసార్లు నటించా అంటూ రిజ్వాన్ ఆస్తకి కర వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ కప్ లో భాగంగా నిన్న జరిగిన పాకిస్తాన్ మరియు శ్రీలంక మ్యాచ్ లో బాబర్ అజామ్ సేన 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. శ్రీలంక నిర్దేశించిన 345 పరుగుల లక్ష్యాన్ని పాక్ చేదిస్తుందని ఎవ్వరూ అనుకుని ఉండరు. ఎందుకంటే పాకిస్తాన్ స్టార్టింగ్ లోనే 2 కీలక వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కింది. కానీ రిజ్వాన్ కారణంగా విజయం సాధించింది పాక్.
అయితే.. శ్రీలంకతో మ్యాచ్ లో సెంచరీతో జట్టును గెలిపించిన పాక్ బ్యాటర్ రిజ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్యాటింగ్ చేస్తుండగా పలుమార్లు కండరాలు పట్టేయడంతో పదేపదే ఫిజియోని మైదానంలోకి పిలిచారు. కాగా…’కొన్నిసార్లు కండరాలు పట్టేసాయి. కొన్నిసార్లు నటించాను’ అని మ్యాచ్ అయ్యాక నవ్వుతూ రిజ్వాన్ చెప్పుకొచ్చారు. నొప్పిలోనూ దేశం కోసం పోరాడాడని కొందరు అంటుంటే… రిజ్వాన్ ఇలా చేయడం కామన్ అని ఇంకొందరు అంటున్నారు.