Online betting | తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. ఆన్‌లైన్‌లో బెట్టింగ్ పెట్టి నష్టపోయిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టెలీగ్రామ్‌లోని లింక్ ఓపెన్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అరవింద్ బెట్టింగ్ పెట్టాడు. ఈ బెట్టింగ్ లో రూ.12 లక్షలు నష్టపోవడంతో తీవ్రమనస్తాపం చెంది చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి మృతితో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.