సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా, అరుణాచల్‌లో బీజేపీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.మొత్తం 32 స్థానాలు ఉన్న సిక్కింలో 30 సీట్లలో ఎస్‌కేఎం ముందంజలో ఉంది. మరోసారి అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా సాగుతోంది. ప్రతిపక్ష సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ కేవలం ఒక స్థానంలో మాత్రమే ఆధిక్యం కనబరుస్తోంది. సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్ ముందంజలో కొనసాగుతు న్నారు. మాజీ సీఎం ఎస్‌డీఎఫ్ అధినేత పవన్ కుమార్ చామ్లింగ్ వెనకంజలో ఉన్నారు. ఎస్‌డీఎఫ్ తరఫున బరిలో ఉన్న భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా సైతం వెనకబడ్డారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు ఢిలీ రామ్ థాపా వెనకంజ లో కొనసాగుతున్నారు. ఇక, అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ మెజారిటీ స్థానాల్లో దూసుకెళ్తోంది. 60 సీట్లున్న అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 33 స్థానాల్లో ముందంజలో ఉంది. నేషనల్ పీపుల్స్ పార్టీ ఆరు, ఎన్సీపీ నాలుగు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ మూడు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యం ఉంది. ఒక స్వతంత్ర అభ్యర్థి ఇప్పటికే విజయం సాధించగా మరో అభ్యర్థి ముందంజలో కొన సాగుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో ఏప్రిల్ 19న ఒకే దశలో పోలింగ్ జరిగింది.


