స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాళ్లరేవు మండలం సీతారామపురం సుబ్బరాయుని దిబ్బ వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓ ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికంగా ఉండే ఓ ఓ రొయ్యల పరిశ్రమలో పనిచేసే మహిళలు ఆటోలో తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులను యానాంలోని నీలపల్లికి చెందినవారుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.