స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: రసవత్తరంగా జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఇటీవలే సిద్దరామయ్య ప్రభుత్వం కొలువుదీరింది. తాజాగా, సిద్దరామయ్య సర్కారుపై ఏడాదిలోగా సిద్ధరామయ్య ప్రభుత్వం పడిపోవడం ఖాయమంటూ తమిళనాడు బీజేపీ స్టేట్ చీఫ్ కే. అన్నామలై హాట్ కామెంట్స్ చేశారు. ఇద్దరు నేతలు రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిస్తూ ప్రభుత్వ ఏర్పాటు చేయడం లోపభూయిష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. కర్ణాటక మాజీ సీఎం బస్వరాజు బొమ్మై మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన వాగ్ధానాలకు, మంత్రి వర్గ భేటీ అనంతరం సిద్ధరామయ్య చేసిన ప్రకటనలకు పొంతన లేదన్నారు.