కామారెడ్డి బీఆర్‌ఎస్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ నిట్టు జాహ్నవిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో ఆమె ఛైర్ పర్సన్ పదవి కోల్పోయారు. కామారెడ్డి కొత్త మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా కాంగ్రెస్ కౌన్సిలర్ గడ్డం ఇందుప్రియ ఎన్నిక య్యారు. మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవిపై సొంత పార్టీ కౌన్సిలర్లే తిరుగుబాటు చేశారు.అవిశ్వాసానికి పరోక్షం గా 9 మంది బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు సహకరించారు. మొత్తం 49 మంది కౌన్సిలర్లకుగానూ, కాంగ్రెస్‌కు 27, టీఆర్‌ఎస్‌కు 16, బీజేపీకి ఆరుగురు ఉన్నారు.
అవిశ్వాస తీర్మానం సమయంలో కోరం సరిపోక పోవడంతో కాంగ్రెస్ కు అనుకూలంగా 9మంది బీఆర్ఎస్ కౌన్సి లర్లు హాజరయ్యారు. బీఆర్ఎస్‌పై అసంతృప్తితో ఉన్న ఈ 9మంది కౌన్సిలర్లు ప్రత్యేక క్యాంపు నుంచి నేరుగా సమావేశానికి హాజరయ్యారు. అవిశ్వాసానికి అనుకూలంగా 27 మంది చేతులు ఎత్తడంతో తీర్మానం నెగ్గింది. దీంతో కొత్త ఛైర్మన్‌గా గడ్డం ఇందుప్రియను ఎన్నుకున్నారు. బీజేపీ కౌన్సిలర్లు సమావేశానికి హాజరుకా లేదు. ఇందుప్రియ కామారెడ్డి 8వ వార్డు కౌన్సిలర్‌గా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బిర్ అలీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులో మున్సిపల్ కార్యాల యానికి వచ్చారు. అలాగే బిఆర్ఎస్ పార్టీకి చెందిన 9 మంది కౌన్సిలర్లు కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ భర్త చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో వచ్చారు. బలపరీక్ష ఎన్నిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ జాహ్నవిపై అవిశ్వాసం నెగ్గింది. అవిశ్వాసం నెగ్గడంతో మున్సిపల్ చైర్మన్‌గా గడ్డం ఇందూ ప్రియని నియమిం చారు. గడ్డం ఇందుప్రియ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్‌ఎస్ ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాసం నెగ్గడంతో కాంగ్రెస్ కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయం బయట టపాసులు కాల్చి స్వీట్లు పంచుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.