స్వతంత్ర వెబ్ డెస్క్: తాజాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ నేత బీజేపీకి(Bjp) షాక్ ఇచ్చారు. తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి(Kishan Reddy) మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్(Chandra Shekar) రాజీనామా లేఖను పంపారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్.. తెలంగాణ ప్రభుత్వ అన్యాయాలను నిలువరించలేకపోతుంది అంటూ లేఖలో పేర్కొన్నారు చంద్రశేఖర్. తెలంగాణ ఉద్యమంలో 12 ఏళ్లు పనిచేశానని గుర్తు చేశారు. కానీ తెలంగాణ వచ్చినా.. యువతకు ఉద్యోగాలు, రైతుల పొలాలకు నీళ్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తన లాంటి చాలా మంది ఉద్యమ నాయకులు.. బీజేపీలో చేరి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారనీ లేఖలో ప్రస్తావించారు. పార్టీ కోసం పని చేసే నేతలను ప్రోత్సహించకపోవటం సహోతుకం కాదన్నారు.గత కొంత కాలంగా సొంత పార్టీపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు చంద్రశేఖర్. ఇప్పటికే కాంగ్రెస్(Congress) నేతలతో ఆయన చర్చలు జరిపారని తెలుస్తోంది. ఈనెల 18న ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో పార్టీలో చేరుతారని సమాచారం.