ఢిల్లీ మేయర్ పీఠాన్ని అమ్ ఆద్మీ పార్టీ దక్కించుకుంది. మేయర్ ఎన్నికలో నెగ్గేందుకు తగిన బలం లేకపోవడంతో బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ తన నామినేషన్ ఉపసంహరించుకుంది. దీంతో ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ మేయర్‌గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా ఆలీ మహమ్మద్ ఇక్బాల్ ను ఎన్నుకున్నారు. ఈ సంధర్భంగా ఇద్దరికి ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే రొటేషన్ ప్రాతిపదికన మేయర్ పదవిలో ఒక ఏడాది మాత్రమే షెల్లీ కొనసాగుతారు.
ఒక్కో ఏడాదికి మేయర్ పదవిని ఒక్కో కేటగిరీకి రిజర్వ్ చేశారు. తొలి సంవత్సరం మహిళలకు రిజర్వ్ చేయగా, రెండో సంవత్సరం ఓపెన్ కేటగిరీ, మూడో ఏడాది రిజర్వ్డ్, చివరి రెండేళ్లు మళ్లీ ఓపెన్ కేటగిరీగా నిర్ణయించారు. కాగా మొత్తం 250 వార్డులు ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 134 చోట్ల ఆప్ అభ్యర్థులు గెలవగా.. బీజేపీ 104చోట్ల గెలిచింది.