స్వతంత్ర వెబ్ డెస్క్: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ గందరగోళం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. పవార్ వర్సెస్ పవార్ వార్ ఢిల్లీకి చేరిన క్రమంలో మహారాష్ట్ర రాజకీయం హస్తిన కేంద్రంగా రసవత్తరంగా సాగుతోంది. తమదే అసలైన ఎన్సీపీ అని శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు తలపడుతుండగా వ్యవహారం ఎన్నికల కమిషన్ (ఈసీ) చెంతకు చేరింది. ఇక ఢిల్లీలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీని ఫిరాయించి షిండే సర్కార్‌లో చేరిన మేనల్లుడు అజిత్ పవార్ సహా 9 మంది ఎమ్మెల్యేలను ఎన్సీపీ నుంచి బహిష్కరించారు. మరోపక్క నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలిక తర్వాత జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ ఢిల్లీలో కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎనిమిది తీర్మానాలను ఆమోదించారు. ఈ మీటింగ్ తర్వాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శరద్ పవార్‌ను కలిశారు. అయితే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. కాంగ్రెస్ మీడియా సమావేశం ఒకేసారి నిర్వహించారు.. విషయం తెలుసుకున్నా.. రాహుల్ గాంధీ అకస్మాత్తుగా తన ప్రెస్ మీట్ ను రద్దు చేసుకుని అక్కడి నుంచి వెంటనే శరద్ పవార్‌ను కలిసేందుకు బయలుదేరారు. రాహుల్ గాంధీ శరద్ పవార్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. దీంతో రాహుల్ గాంధీకి జితేంద్ర అవద్ స్వాగతం పలికారు. ఈ భేటీలో ఎన్సీపీలో తిరుగుబాటు, ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు వ్యూహంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. జాతీయ కార్యవర్గం శరద్ పవార్‌పై విశ్వాసం వ్యక్తం చేసింది.
జాతీయ కార్యవర్గం శరద్ పవార్‌పై విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో ఎన్సీపీ కార్యవర్గం 8 తీర్మానాలను ఆమోదించింది. పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్‌పై కమిటీ పూర్తి నమ్మకం వ్యక్తం చేసింది. అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే, ఎన్డీయేతో చేతులు కలిపిన 9 మంది ఎమ్మెల్యేలను బహిష్కరిస్తూ శరద్ పవార్ తీసుకున్న నిర్ణయాన్ని ఎన్సీపీ కార్యవర్గం ఆమోదించింది. ఎన్సీపీలో చీలిక తర్వాత ఇద్దరు నేతలు భేటీ కావడం ఇదే తొలిసారి. అంతకుముందు పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశంలో రాహుల్ గాంధీ, శరద్ పవార్ సమావేశమయ్యారు. ఈ భేటీపై శరద్ పవార్ వర్గం నేత జితేంద్ర అవద్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ తమను కలవడానికి వచ్చారని అన్నారు. అందరం కలిసికట్టుగా ఉన్నామని భరోసా ఇచ్చారు. మన దగ్గర అన్నీ ఉన్నాయి.. కొంత మంది వెళ్లినా పర్వాలేదు అని శరవ్ పవార్ కు రాహుల్ గాంధీ ధైర్యం చెప్పారని జితేంద్ర అవద్ అన్నారు. లెజిస్లేచర్ పార్టీ విచ్ఛిన్నమైతే ఆ పార్టీలో చీలిక వచ్చిందని కాదు అని ఆయన తెలిపారు.


