తమిళ్ సినీ ఇండస్ట్రీలో నిర్మాతల మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. అడ్వాన్స్‌లు తీసుకొని పూర్తి చేయని నటి నటులపై కొరడా ఝలిపించారు. ఆగస్ట్ 15 తరువాత కొత్త సినిమా షూటింగ్స్‌ను నిర్మాతల మండలి నిలిపివేసింది. పెండింగ్‌లో ఉన్న సినిమాలు పూర్తి చేసిన తరువాతే కొత్త సినిమాల షూటింగ్స్ మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకుంది. పెండింగ్ మూవీలు ఇచ్చిన అడ్వాన్స్‌ల పై నిర్మాతలను మండలి నివేదిక అడిగింది. ఇక నుంచి ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమాకు కాల్ షిట్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ హీరో హీరోయిన్ కూడా అడ్వాన్స్ తీసుకోవడంపై నిషేధం విధించారు.
నటుడు ధనుష్ తీరుపై నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. అడ్వాన్స్‌లు తీసుకొని షూటింగ్స్ పూర్తి చేయడం లేదని ధనుష్‌పై ఫిర్యాదులు వచ్చాయి. నిర్మాతల మండలి పర్మిషన్ ఉంటేనే ధనుష్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది.


