22.2 C
Hyderabad
Sunday, January 18, 2026
spot_img

విజయసాయిరెడ్డిపై విచారణ జరిపించాలి: నట్టికుమార్

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై వచ్చిన అభియోగాలపై వెంటనే విచారణ జరిపించాలని సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, “ఇంతవరకు విశాఖపట్నం కొల్లగొట్టిన వైసీపీ నాయకుడిగా విజయసాయిరెడ్డిపై ఆరోపణలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఆయనలోని మరో కోణం వెలుగు చూస్తోంది. ఆయన 65 ఏళ్ల తాత కాదు. 16 ఏళ్ల బాలా కుమారుడు అన్న రీతిలో ప్రవర్తిస్తున్నారని వస్తున్న ఆరోపణలు తేటతెల్లం చేస్తున్నాయి. ఏదో ఆశించి,కేవలం ఆదవాళ్ళకు మాత్రమే ఆయన సాయం చేస్తుంటారన్న భయంకరమైన విషయాలపై ప్రస్తుతం రచ్చ జరుగుతోంది. శాంతికి సంబంధించి ఆయనపై వచ్చిన ఆరోపణలలో నిజం లేదని ఆయనే నిరూపించుకోవాలి. ఆయనలో నిజాయితీ ఉంటే డిఎన్ఎ పరీక్షకు సిద్దంకావాలి. విలేఖర్లను ఒరేయ్, అరేయ్ అంటూ వివిధరకాలుగా ఆయన తూలనాడటాన్ని ఖండిస్తున్నాను. తనపై వచ్చిన ఆరోపణలపై ప్రశ్నలు అడిగినపుడు ఆయన సమాధానాలు చెప్పలేక, ఉలిక్కిపడి, దుర్భాషలాడినట్లు అర్ధమైపోతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయసాయిరెడ్డి ఒక షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. విశాఖపట్నంలో ఆయన చేసిన అక్రమాలు, అలాగే ప్రస్తుతం ఆయనపై వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం వెంటనే ఆయనపై విచారణ జరిపించి, తగిన చర్యలు తీసుకోవాలి. రాజ్యసభ స్పీకర్ కూడా విచారణ చేసి, ఆయన సభ్యత్వాన్ని సస్పెండ్ చేయాలి” అని స్పష్టం చేశారు.

ఇంకా మాట్లాడుతూ, “రెండు తెలుగు రాష్ట్రాలలో యువత డ్రగ్స్ బారిన పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. పట్టుబడ్డ పెద్దవాళ్ళను పోలీసులు వదిలేషి, చిన్న చిన్న వ్యక్తులను దోషులుగా చూపడం కరెక్ట్ కాదు. డ్రగ్స్ అనగానే ఎంతసేపు సినీ పరిశ్రమపై వేలెత్తి చూపడం సమంజసం కాదు. సినీ పరిశ్రమలోని వారు తప్పు చేసినా ఉపేక్షించాల్సిన అవసరం లేదు అని నట్టి కుమార్ అన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్