దక్షిణకొరియాలో రెండో రోజు తెలంగాణ మంత్రుల బృందం పర్యటిస్తోంది. ఇవాళ ముఖ్యంగా హన్ నదిపై మంత్రుల బృందం అధ్యయనం చేయనుంది. సియోల్ నగరంలో నీటి సరఫరాతో పాటు పర్యావరణం మరియు ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న హాన్ నదిని మంత్రులు పరిశీలించనున్నారు. దక్షిణకొరియా రాజధానిలో కాలుష్యానికి గురైన హాన్ నదిని శుభ్రపరచి, పునరుద్ధరించింది అక్కడి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా ప్రభుత్వం నుంచి సమాచారం తెలుసుకునేందుకు, ప్రత్యక్షంగా చూసేందుకు మంత్రులు అక్కడకు వెళ్లారు. మూసీ నది పునరుజ్జీవం కోసం ఈ అధ్యయన యాత్రను మంత్రులు చేపట్టారు.