ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికకు షెడ్యూల్ రిలీజ్ అయింది. మండలిలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నారు. జులై 12న ఎన్నికలు నిర్వహించి, అదేరోజు ఫలి తాలు విడుదల చేస్తారు. నామినేషన్లకు జులై 2 వరకు గడువు ఇచ్చారు. ఇక్బాల్ YCPతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. టీడీపీలో చేరడంతో సి.రామచంద్రయ్యపై అనర్హత వేటు పడింది. దీంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవడంతో ఈసీ ఉప ఎన్నికకు షెడ్యూల్ ప్రకటించింది.


