22.2 C
Hyderabad
Thursday, December 26, 2024
spot_img

Bandi Sanjay: సర్కార్ దగ్గర పైసల్లేక భూములను అమ్ముకునే దుస్థితి వచ్చింది..!

స్వతంత్ర వెబ్ డెస్క్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న బండి సంజయ్‌(Bandi Sanjay)కి తెలంగాణ బీజేపీ తెలంగాణ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. వేద పండితులు ఆయనకు ఆహ్వానం పలికారు. బిజెపి మహిళా కార్యకర్తలు బండి సంజయ్‌కి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో బండి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వందల కిలోమీటర్లు నాతో నడిచిన సంగ్రామ సేనకు రుణపడి ఉంటాను. ఇంత పెద్ద అవకాశమిచ్చిన మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు ధన్యవాదాలు. ఎన్నికల యుద్ధ రంగంలో ఉన్నాం. కార్యకర్తల త్యాగాలను వృధాగా పోనివ్వము. గోల్‌కొండపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం. బీజేపీలో గ్రూపులున్నాయని, పార్టీ గ్రాఫ్ తగ్గిందనేది కేవలం దుష్ప్రచారమే. మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు, పార్టీని అధికారంలోకి తీసుకొని రావడమే మా లక్ష్యం. కిషన్ రెడ్డి(Kishan Reddy) నాయకత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తాము’ అని చెప్పుకొచ్చారు.

ఇక బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో ఫైర్‌ అయ్యారు బండి సంజయ్‌. వర్షాలతో జనం విలవిల్లాడితే పరామర్శించని కేసీఆర్ మహారాష్ట్రలో రాజకీయాలు చేస్తున్నడన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసే మళ్లీ హామీల అమలు పేరుతో ఎన్నికల స్టంట్ చేస్తున్నడనన్నారు. రుణమాఫీ, వీఆర్ఏ, జేపీసీల క్రమబద్దీకరణ వంటి హామీలు ఎన్నికల డ్రామాలేనని విమర్శించారు. కేసీఆర్‌ను ఎవరు నమ్మరన్న బండి సంజయ్‌.. సర్కార్ దగ్గర పైసల్లేక ఎన్నికల తాయిలాల కోసం భూములను అమ్ముకునే దుస్థితి వచ్చిందన్నారు.

 

Latest Articles

విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని దివాలా తీయించే ఎత్తుగడలు – షర్మిల

విశాఖ స్టీల్ ఫ్యాక్టరీపై కేంద్రం చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని దివాలా తీయించే ఎత్తుగడలు సాగుతున్నాయన్నారు. ప్రధాని మోదీ దోస్తులకు అమ్మే కుట్రలు జరుగుతూనే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్