జాతీయ సినిమా దినోత్సవాన్ని పురస్కరించుకుని సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డుల ఈవెంట్‌కి సంబంధించిన డేట్ అనౌన్స్ చేశారు ప్రముఖ అగ్ర కథానాయిక శ్రీలీల. ఈరోజు అధికారికంగా ఒక వీడియో రిలీజ్ చేస్తూ శ్రీ లీల ఈ సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డుల ఈవెంట్ డిసెంబర్ 2న గోవాలో అంగరంగ వైభవంగా జరగనుందని ప్రకటించారు. గోవాలోని బాంబోలిం బీచ్‌కు అతి చేరువలో ఉన్న డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో ఈ అవార్డుల వేడుక ఘనంగా జరగనుంది. ఇక అదే సమయంలో గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరగనుంది. 150 దేశాల నుంచి సినీ ప్రేమికులు ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు హాజరుకానున్నారు. ఇక ఆ దేశాల సినీ ప్రేమికులు, మన ఇండియన్ సినీ లవర్స్ మోహరించి ఉన్న గోవాలో వేలాది ప్రేక్షకుల మధ్య సంతోషం 22వ సౌత్ ఇండియన్ ఇండియన్ ఫిలిం అవార్డుల వేడుక జరగనుంది. ఈ వేడుకకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.


