29 C
Hyderabad
Monday, September 29, 2025
spot_img

ఈనెల 18న హైదరాబాదులో సంతోషం ఓటీటీ అవార్డ్స్

ఈ సంవత్సరం గోవాలో సంతోషం ఫిలిం అవార్డ్స్ నిర్వహిస్తున్న సందర్భంగా సంతోషం అధినేత సురేష్ కొండేటి మీడియాతో మాట్లాడారు. ‘‘ఈనెల 18న హైదరాబాదులో సంతోషం ఓటీటి అవార్డ్స్ – డిసెంబర్ 2న గోవాలో సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నాం. నాకు సహకరిస్తున్న చిత్ర పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరికి, అలాగే మీడియా మిత్రులు అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే అందరు హీరోల అభిమానులకి కృతజ్ఞతలు. అలాగే సంతోషం ఓటీటీ అవార్డ్స్ కూడా గత ఏడాది మొట్టమొదటిగా మొదలుపెట్టింది సంతోషం సంస్థ. రెండవసారి ఈ సంవత్సరం కూడా ఈ నెల 18న ఓటీటీ అవార్డ్స్‌ని నిర్వహించడం జరుగుతుంది’’ అని సురేష్ కొండేటి తెలిపారు.

అనంతరం పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ.. ‘‘సంతోషం సంస్థ నుంచి 25 సంవత్సరాల పాటు అవార్డులు కొనసాగించాలని అనుకున్నాను. ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది. ఇంకో మూడు సంవత్సరాలు కచ్చితంగా అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలి. సంతోషం మ్యాగజైన్ మొదలు పెట్టినప్పుడు నాకు ఇంకా చిన్న వయసు. నాగార్జున గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు లాంటి అగ్ర నటీనటులందరూ ఇచ్చిన ప్రోత్సాహంతో అవార్డ్స్ మొదలుపెట్టాను. టాలీవుడ్ కింగ్ నాగార్జున గారు సంతోషం సురేష్ కొండేటి కూడా ఫిలింఫేర్ స్థాయిలో అవార్డ్స్ నిర్వహించగలడు. ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలనుకున్నాను. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, లాంటి అగ్ర హీరోలు సురేష్ కొండేటి చేయగలడు అని నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇన్నాళ్లు వరకు సంతోషం ఫిలిం అవార్డ్స్ ఎక్కడా ఆగకుండా నిర్వహించాను.. నిర్వహిస్తున్నాను. గోవా గవర్నమెంట్ వాళ్ళ సహకారం మర్చిపోలేనిది. ఆ గవర్నమెంట్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని సురేష్ కొండేటి అన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్