24.9 C
Hyderabad
Tuesday, July 8, 2025
spot_img

అర్బన్‌ కంపెనీ ప్రకటనపై సానియా స్పందన

      మహిళల విజయంపై శక్తివంతమైన సందేశంతో కూడిన అర్బన్‌ కంపెనీ ప్రకటనపై టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. కంపెనీ ప్రకటన… దాదాపు నాలుగు నిమిషాల పాటు ఒక బ్యూటీషియన్‌ కథపై ఆధారపడి ఉంటుంది. ఆ యాడ్‌ పై భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఉద్విగ్నంగా సోషల్‌ మీడియాలో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు. సమాజంలో ఓ మహిళ సాధించిన విజయాన్ని ఎలా విలువ కడుతున్నారన్న విషయమై మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని సానియా అన్నారు.‌ స్త్రీ, పురుష వివక్ష అనేది ఇంకా వ్యాప్తిలో ఉండటంపై విచారం వ్యక్తం చేశారు సానియా మీర్జా.

           2005లో డబ్ల్యూటీఏ టైటిల్‌ గెలిచి.. ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళగా నిలిచానన్నారు. డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌గా ఉన్నప్పుడు.. తాను ఎప్పుడు స్థిరపడతానా అని ప్రజలు ఆసక్తిగా చూశారన్నారు. ఆరు గ్రాండ్‌ స్లామ్‌లు గెలవడం ఈ సమాజానికి సరిపోలేదని… ఈ కెరీర్‌లో తనకు ఎంతో మంది మద్దతు ఇచ్చారన్నారు. కానీ, ఓ మహిళ విజయం సాధించినప్పుడు నైపుణ్యాలు, శ్రమకు బదులు గా అసమానతలు, ఆమె ఆహార్యం గురించే ఎందుకు చర్చిస్తారనేది ఇప్పటికీ అర్థం కాదన్నారు. ఈ యాడ్‌ చూసిన తర్వాత తన మదిలో ఎన్నో భావాలు మెదిలా యన్నారు. ఈ సమాజంలో వాస్తవాల గురించి మాట్లాడటం కష్టమేనని తెలుసన్నారు. కానీ, ఓ మహిళ సాధించిన విజయానికి మనం ఎలాంటి విలువ ఇస్తున్నామనే దానిపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. కానీ, అది ఎప్పటికి జరిగేనో అని పోస్ట్‌లో వివరించారు. సానియా మీర్జా భారతీయ టెన్నిస్‌ మహిళల డబుల్స్‌ లో నెం.1 ర్యాంకు పొందిన క్రీడాకారిణిగా పేరొందిన విషయం విదితమే. 2003 నుండి 2013లో సింగిల్స్‌ నుండి విరమణ తీసుకు నేవరకు విమెన్స్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ ప్రకారం భారతదేశంలో సింగిల్స్‌, డబుల్స్‌ విభాగాల్లో నెం.1 క్రీడాకారిణిగా గుర్తింపబడ్డారు. సానియా కెరీర్‌ మొదటి నుండే అత్యంత విజయవంతమైన భారతీయ టెన్నిస్‌ క్రీడాకారిణిగా నిలిచారు.  

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్