స్వతంత్ర వెబ్ డెస్క్: కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ హీరోగా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతోన్న చిత్రం ఘోస్ట్. ‘వన్స్ ఏ గ్యాంగ్ స్టర్, ఆల్వేస్ ఏ గ్యాంగ్ స్టర్’ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ‘ఘోస్ట్’ సినిమాని ‘బీర్బల్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ‘శ్రినీ’ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని కూడా ఎప్పుడో స్టార్ట్ చేసారు. న్యూ ఇయర్ గిఫ్ట్ గా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్, ట్విట్టర్ ని షేక్ చేసింది.
సందేశ్ నాగరాజ్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘ఘోస్ట్’ సినిమాతో శివన్న పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చెయ్యబోతున్నాడు. కన్నడనాట సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న శివరాజ్ కుమార్, తన సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చెయ్యడం ఇదే మొదటిసారి. ఇప్పటికే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కిచ్చా సుదీప్, యష్, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టిలు బౌండరీలు దాటి కొత్త మార్కెట్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా మేకర్స్ ‘బిగ్ డాడీ’ గ్రాండ్ డెబ్యూ ఇవ్వబోతున్నాడు రెడీగా ఉండండి అంటూ మేకర్స్ ట్వీట్ చేసారు. జులై 12 ఉదయం 11:45 నిమిషాలకి టీ సీరీస్ యుట్యూబ్ ఛానెల్ లో ఘోస్ట్ టీజర్ బయటకి రానుంది. బిగ్ డాడీ అనౌన్స్మెంట్ ను స్ట్రైకింగ్ పోస్టర్ తో ప్రకటించారు. శివరాజ్ కుమార్ గన్ తో సీరియస్ లుక్ తో ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. మరి సూపర్ స్టార్ శివన్న కూడా ‘ఘోస్ట్’ సినిమాతో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి న్యూ పాన్ ఇండియా హీరో అవుతాడేమో చూడాలి.
శివన్నతో పాటు ఉపేంద్ర, రాజ్ బీ శెట్టి కూడా ఘోస్ట్ సినిమాలో నటిస్తుండడంతో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘ఘోస్ట్’ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మస్తీ, ప్రసన్న వి ఎం డైలాగ్స్ రాస్తున్నారు. కె జి ఎఫ్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్ట్ డైరెక్టర్ శివ కుమార్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడ లో టాప్ స్టార్స్, టెక్నిషన్స్ తో చిత్రాలు తీసే సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సందేశ్ నాగరాజ్ ‘ఘోస్ట్’ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.